విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)
తనకు విడాకులు మంజూరయ్యే వరకు తాను నటనకు దూరంగా ఉంటానని, అప్పటివరకు తన సినిమాలు బిగ్ స్క్రీన్‌పై విడుదల కాబోవని హీరో రవి స్పష్టం చేశారు. తన భార్య ఆర్తితో ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకుల కోసం న్యాయపోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రవి మోహన్ జీవితంలోకి బెంగుళూరుకు చెందిన ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ ప్రవేశించారు. ఆమెతో సన్నిహితంగా మెలుగుకూ వచ్చారు. అయితే, కెనీషాను లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్‌పుల్లింగ్ చేశారు. ఈ వేధింపులను తట్టుకోలేని కెనీషా... హీరో రవి మోహన్‌తో పాటు చెన్నై నుంచి వెళ్లిపోతున్నట్టు శుక్రవారం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రవి మోహన్ శనివారం చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భావోద్వేగంతో మాట్లాడారు. తాను ఎన్నో రోజులుగా సహనంతో ఉంటున్నానని.. వ్యక్తిగత విషయాల ఎక్కడా మాట్లాడలేదన్నారు. ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు. తన పిల్లలకు కూడా తనని దూరం చేశారని కన్నీరు పెట్టుకున్నారు.
'ఈ ప్రెస్‌మీట్‌లో కొన్ని విషయాలు ప్రత్యక్షంగా నా అభిమానులతో చెప్పాలనుకుంటున్నాను. ఇంతకాలం నా వ్యక్తిగత జీవితాన్ని మీతో పంచుకోనందుకు క్షమించండి. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. విడాకులు వచ్చే వరకూ నా సినిమాలు ఏవీ విడుదల కావు. అప్పటివరకూ నేను కూడా నటించలేను. నాకు జరిగిన అవమానాలు ఇక భరించడం నా వల్ల కాదు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఆపేవరకూ నేను నటించలేను. ఆఫీసులోనే ఉంటాను. రండి.. ఎంతగా ఇబ్బందిపెడతారో పెట్టండి. ఇకపై నేను మౌనంగా ఉండాలని అనుకోవడం లేదు'.
'నాకు విడాకులు వస్తాయా.. రావా అనేది పక్కన పెడితే నాపై జరుగుతోన్న ట్రోలింగ్ నన్ను బాధిస్తోంది. నా కెరీర్‌లో 95 శాతం చిత్రాలు హిట్. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. మహిళల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశా. అలాంటి నాపై ఎన్ని నిందలు వేస్తున్నారు. నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని నేను లక్షలు పెట్టివాళ్లను చదివించాను. వాళ్లపై నాకున్న ప్రేమ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. నాకు ప్రేమలేదని రాసేస్తున్నారు. అవి ఎంత బాధిస్తోయో మీకేం తెలుసు' అని బోరునవిలపించారు.
కేవలం ట్రోలింగ్ కారణంగానే తన స్నేహితురాలు కెనీషాను కోల్పోయానని అన్నారు. ఆమె ఎన్నో వేధింపులు ఎదుర్కొందన్నారు. ఇక తన వ్యక్తిగత జీవితంలో అడ్డంకులు అన్నీ తొలగిపోయిన తర్వాత ఖచ్చితంగా నటిస్తానని రవిమోహన్ చెప్పారు. దానికి ఎంత సమయం పడుతుందో తెలియదని.. కానీ, అంతా మంచే జరుగుతుందని అన్నారు.
VIDEO | Chennai, Tamil Nadu: "I will not act in films until my divorce is sorted," says Actor Ravi Mohan, as he turns emotional during press meet.
— Press Trust of India (@PTI_News) May 16, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/4YvlI2l3EO
