గురువారం, 12 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 5 ఫిబ్రవరి 2026 (15:28 IST)

రవితేజ లా మాధవ్ స్వశక్తితో ఎదగాలని కోరుకుంటున్నా : బాబీ కొల్లి

Madhav, Manchala Nagaraju, Bobby Kolli, Deepa Balu
Madhav, Manchala Nagaraju, Bobby Kolli, Deepa Balu
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీం ఈరోజు టీజర్‌ను లాంచ్ చేసింది.
 
టీజర్ లో ఏముందంటే... ఒక అంటువ్యాధి గ్రామాన్ని చుట్టుముట్టి, ప్రజలు, పశువుల ప్రాణాలను బలిగొంటుంది. గ్రామస్తులు తమ గ్రామ దేవత మారెమ్మ తల్లిని ప్రార్ధిస్తారు. ఆ దేవతకు సంబంధించిన పవిత్ర ఎద్దును కాపాడే బాధ్యత హీరోది. అయితే ఒక రోజు ఆ ఎద్దు అనూహ్యంగా అదృశ్యమవుతుంది. ఇక్కడినుంచే కథ కీలక మలుపులు తిరుగుతుంది.
 
ఇది మాధవ్‌కు తొలి చిత్రమైనప్పటికీ, అతను ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఉండే కథను ఎంచుకున్నాడు. పూర్తిగా రూరల్ లుక్‌లో కనిపించిన మాధవ్, తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్నాడు. తొలి సినిమానే ఎంతో అనుభవం వున్నా నటుడిలా అనిపించాడు. అతనికి జోడీగా దీపా బాలు నటించగా, గ్రామ పెద్ద పాత్రలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ బలమైన ముద్ర వేశారు.
 
తన తొలి ప్రయత్నంలోనే దర్శకుడు మంచర్ల నాగరాజు తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో అద్భుతమైన కథను సిద్ధం చేశారు. సినిమాటోగ్రాఫర్ ప్రశాంత్ అంకిరెడ్డి గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి  పవర్ ఫుల్ నేపథ్య సంగీతంతో ఉత్కంఠను పెంచారు. దేవ్ రాథోడ్ ఎడిటర్, రాజ్‌కుమార్ మురుగేశన్ ఆర్ట్ డైరెక్టర్.
 
డైరెక్టర్ బాబి కొల్లి మాట్లాడుతూ... రవితేజ గారితో జర్నీ చేస్తున్నప్పుడు మాధవ్ ని చూస్తూ ఉండేవాణ్ణి. రవితేజ గారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. అలాగే మాధవ్ కూడా తన కాళ్ళ మీద తనే నిలబడాలని ఆయన కోరుకుంటున్నారు. టీజర్ చూస్తుంటే చాలా మంచి పాయింట్ చుట్టూ నడిపారని అనిపిస్తుంది. సినిమా బాగుంటే కచ్చితంగా రవితేజ గారి ఫాన్స్, ఆడియన్స్ అందరు కూడా చూస్తారు. ఈ టీజర్ లో నాకు మ్యూజిక్ నాకు చాలా నచ్చింది. టీజర్ ఎంత అద్భుతంగా ఉందో సినిమా కూడా అంత ఎక్సైటింగ్ గా  ఉంటుందని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ గుడ్ లక్.  
 
హీరో మాధవ్ మాట్లాడుతూ, ఈ స్క్రిప్ట్ రావడం లక్కీగా ఫీల్ అవుతున్నాను.  నిర్మాతలకు థాంక్యు సో మచ్. విజువల్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. విహారి మ్యూజిక్ ఇరగదీసాడు. టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్.