1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. I wrote the story of Peddi at the Dattatreya Swamy temple : Bujjibabu Sana

దత్తాత్రేయ స్వామి గుడిలో పెద్ది కథను రాసుకున్నా: బుజ్జిబాబు సానా

Peddi latest twitter poster
Peddi latest twitter poster
పెద్ది చిత్రం గురించి దర్శకుడు ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రమోషన్ లో భాగం ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలు తెలుపుతూ, అసలు పెద్ది కథను మెగాస్టార్ చిరంజీవి కూడా చెప్పలేదన్నారు. కథా చర్చల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనలేదని, ఆయన నుంచి ఎలాంటి సలహాలూ తీసుకోలేదని తెలిపారు. చాలామంది అనుకుంటున్న దానికి భిన్నంగా, ప్రస్తుతం ఒక కథను ఎంచుకోవడంలో తుది నిర్ణయం తీసుకునేది రామ్ చరణేనని ఆయన తెలిపారు.
 
“నేను చరణ్ సార్‌కు స్క్రిప్ట్ చెప్పాను. ఆయన వెంటనే నన్ను కౌగిలించుకుని, మనం ఈ సినిమా చేస్తున్నామని చెప్పారు. నేను చిరంజీవి గారికి 'ఉప్పెన' కథ చెప్పాను, కానీ 'పెద్ది' కథ చెప్పలేదు. చిరు సార్‌కు కథ చెప్పమని చరణ్ సార్ నన్ను ఒక్కసారి కూడా అడగలేదు. ఇది చాలా గొప్పగా అనిపిస్తోంది, ఎందుకంటే మా గురువు సుకుమార్ సార్ కూడా మెగాస్టార్ గారికి 'రంగస్థలం' కథ చెప్పారు, కానీ నేను చెప్పలేదు,” అని బుచ్చిబాబు సానా అన్నారు.
 
అయితే, కథంతా ఓకే అయ్యాక చిరంజీవి గారు నన్ను కొద్దికొద్దిగా కథ చెప్పమని అడిగారు, కానీ నేను ఆయనకు సినిమాను ఒకేసారి చూపించి, ఆయన స్పందనను నేరుగా చూడాలని నిర్ణయించుకున్నాను.” అన్నారు.
 
అలాగే, ఈ కథను ఉప్పెనకు ముందే చరణ్ కోసం రాసుకున్నా. దీంతో ఈ కథ మొదట ఎన్.టి.ఆర్.  కోసం రాసారన్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ వచ్చింది. ఈ కథ సెట్ అయ్యాక ఆర్.ఆర్.ఆర్.లో చరణ్ బిజీగా వుండడంతో కుదరలేదు. తర్వాత ఎన్.టి.ఆర్.కు వినిపించినా అది వర్కవుట్ కాలేదు.  అందుకే ఎవరికి రాసిపెట్టి వుందో వారికే దక్కిందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
 
పిఠాపురం దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చునే ఈ 'పెద్ది' కథను రాసుకున్నానని, రామ్ చరణ్ ఇమేజ్‌ను మైండ్‌లో పెట్టుకుని మాత్రమే ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశానని బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
అమెరికా వెలుపల మొదటి రిసార్ట్‌ను సౌదీలోని షురా ద్వీపంలో ప్రారంభించిన మిరావల్ ది రెడ్ సీ