Allu Sirish: దుబాయ్‌లో శిరీష్ ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
Allu Sirish pre wedding party
అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ పెండ్లి నిశ్చమయిన విషయం తెలిసిందే. నయనిక రెడ్డి తో మార్చి 6న వివాహం జరగబోతోంది. ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ షూట్ ను దుబాయ్ నిర్వహించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. బోట్ లో షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేస్తూ ఛీర్స్ చెబుతూ అల్లు అర్జున్ కూడా తన భార్య స్నేహారెడ్డితో కనిపించి అభిమానులను అలరించాడు. పరిమిత సభ్యులతో జరిగిన ఈ వేడుక అందరినీ కనువిందు చేస్తోంది.
కాగా, ఈ దుబాయ్ పార్టీలో సోఫీ చౌదరి, సహీబా బాలి వంటి బి-టౌన్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. శిరీష్‌తో కలిసి వారు దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవ్వడంతో బాలీవుడ్ సర్కిల్స్‌లో కూడా ఈ పెళ్లి గురించిన చర్చ మొదలైంది. దీనికి కారణం కూడా వుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ను హిందీలో గ్రాండ్‌గా లాంచ్ చేసే బాధ్యతను శిరీష్ చేతిలో అల్లు అరవింద్ పెట్టినట్లు తెలుస్తోంది. శిరీష్ కు మార్కెటింగ్ అంటే చాలా ఇష్టం. నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ క్రేజ్ ను ద్రుష్టిలో పెట్టుకుని ప్రొడక్షన్ హౌస్‌ను ఎస్టాబ్లిష్ చేయాలని శిరీష్ భావిస్తున్నారని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.