సంబంధిత వార్తలు
- Dhanush: కర సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది : హీరో ధనుష్
- Dhanush: కరసామిగా ధనుష్ పోరాటం ఎవరిపైనే తెలియాలంటే టీజర్ చూడాల్సిందే
- Dhanush: ఒకప్పుటి బ్యాంకు దొంగ - కనికరం లేని పోలీస్ అధికారి కథే ధనుష్... కారా ట్రైలర్
- Dhanush: ధనుష్ కారాలోని కన్నమ్మా ఎన్ కన్నమ్మ పాట 1 మిలియన్ వ్యూస్ దాటింది
- అడివి శేష్ డెకాయిట్ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్
Dhanush: కర లాంటి కంటెంట్ మూవీ వస్తుంటే థియేటర్ల బంద్ ఉండదు :సీహెచ్. సతీష్ కుమార్
KARA distributer, and telugu producer Ch. Satish Kumar
* మాది విశాఖపట్నం. చిన్న సినిమాల్ని కొంటూ డిస్ట్రిబ్యూషన్ స్టార్ చేశాను. ఆ తరువాత ఓ మూవీని కూడా నిర్మించాను. అర్జున్ రెడ్డి, కబాలి, సింగం 3, సలార్, కాంతారా చాప్టర్ 1 వంటి సినిమాల్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూషన్ చేశాను. ధనుష్ గారి ధర్మయోగి సినిమాని తెలుగులో రిలీజ్ చేశాను. ప్రొడక్షన్‌లోనూ మంచి సినిమాల్ని చేయాలని అనుకుంటున్నాను. ఈ కర మూవీ కోసం నా స్నేహితుడు రాజేష్ సపోర్ట్ తీసుకున్నాను.
* ధనుష్ గారికి మంచి మార్కెట్ ఉంది. ఇందులో మంచి కంటెంట్ ఉందని నాకు నమ్మకం ఉంది. ఈ మూవీ గొప్ప విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. కుబేర మంచి విజయం సాధించింది. ఇడ్లీకొట్టుని తెలుగులో సరిగ్గా ప్రమోట్ చేయలేదనిపిస్తుంది. రాయన్ తెలుగు వారికి రీచ్ అయింది. ఈ కర మూవీని నా శక్తి మేరకు తెలుగు ప్రేక్షకుల వద్దకు తీసుకు వెళ్తాను.
* ధనుష్ సినిమా అంటే చాలా మంది పోటీ పడతారు. కానీ నేను పర్సనల్‌గా కేర్ తీసుకుని నిర్మాత గణేష్ గారిని అప్రోచ్ అయ్యాను. నా ప్రయత్నం చూసి ఈ చిత్రాన్ని నాకు ఇచ్చారు. 80 శాతం బిజినెస్ ఆల్రెడీ కంప్లీట్ అయింది.
* సాధారణ ప్రేక్షకులందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ఓ సాధారణ మనిషికి ఎదురయ్యే సమస్యల్ని చాలా స్ట్రాంగ్ కంటెంట్, ఎమోషనల్ కంటెంట్‌తో కర రాబోతోంది. నేను ఇంకా తెలుగు వర్షెన్‌ను చూడలేదు. మ్యాగ్జిమం ఎవ్వరూ కూడా సినిమాని అలా ముందే చూపించరు.
* నైజాంలో దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలా ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరికి ఇచ్చాం. నేను ఉత్తరాంధ్ర ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. దాదాపు 400కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. హిందీ వర్షెన్‌తో కలిపితే 600కి పైగా స్క్రీన్లలో వచ్చే అవకాశం ఉంది.
* థియేటర్ల బంద్ అనేది ఉండకపోవచ్చు. మంచి కంటెంట్ మూవీ వస్తుంటే థియేటర్ల బంద్ అనేది ఉండదు. అసలే సమ్మర్‌లో ఇంత వరకు ఓ పెద్ద సినిమా రాలేదు. మా ఈ కర మూవీకి అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
* కరస్వామి అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందుకే తెలుగులో కర అనే టైటిల్‌ను పెట్టారు.
* పోరు తొళిల్ నాకు ఎంతో ఇష్టమైన సినిమా. విఘ్నేశ్ గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది. కరలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉన్నాయి. ఇది పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ధనుష్ గారున్నారు.
* లోకల్ విలేజ్ అని కాకుండా ఇంటర్నేషనల్ రిలేటెడ్ కంటెంట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా ఇందులో చూపిస్తున్నారు. జీవీ ప్రకాష్ గారి సంగీతం బాగుంటుంది. ఇంకా కొన్ని పాటలు డైరెక్ట్‌గా తెరపైనే చూడాలి. అన్ని పాటలు స్క్రీన్ పై అద్భుతంగా ఉంటాయి. సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
