శుక్రవారం, 23 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 16 డిశెంబరు 2025 (18:25 IST)

గుర్రం పాపిరెడ్డి లాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది : బ్రహ్మానందం

Brahmanandam, Naresh Agastya, Faria Abdullah
Brahmanandam, Naresh Agastya, Faria Abdullah
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
 
 
బ్రహ్మానందం మాట్లాడుతూ - సినిమాలో నేను ఇంపార్టెంట్ రోల్ చేశాను. కథను ప్రేక్షకులకు తెలియజేసే జడ్జి పాత్రలో నటించాను. ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఈ చిత్రాన్ని ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా కొత్త పద్ధతిలో దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కించాడు. యోగి బాబు పాత్ర స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. అతనితో నాకు కాంబినేషన్స్ సీన్స్ ఉండవు కానీ యోగిబాబు ఈ మూవీలో హిలేరియస్ కామెడీ చేశాడు. జీవన్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వశీధర్ కోసిగి తమ పాత్రల్లో బాగా నటించారు. దర్శకుడు వారితో అలా పర్ ఫార్మ్ చేయించారు. నేను సెట్ లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్స్ ఓల్డ్ గెటప్ లో వచ్చి కలిశారు. ఎవరో బయటవారు షూటింగ్ చూసేందుకు వచ్చారని అనుకున్నా. ఇలా డిఫరెంట్ గెటప్స్ లో హీరో నరేష్, హీరోయిన్ ఫరియా ఆకట్టుకుంటారు. ప్రొడ్యూసర్స్ సినిమా బాగా వచ్చేలా రాజీ పడకుండా నిర్మించారు. ఈ నెల 19న "గుర్రం పాపిరెడ్డి" రిలీజ్ అవుతోంది. కొత్త వాళ్లు చేసిన ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. మరిన్ని మంచి చిత్రాలు వారు చేసే అవకాశం కలుగుతుంది. అన్నారు.
 
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ - ఈ సినిమాలో సౌధామిని క్యారెక్టర్ లో మీ ముందుకు వస్తున్నాను. ఒక డిఫరెంట్  డార్క్ కామెడీ చిత్రమిది. ఈ ఈవెంట్ లో మా డైరెక్టర్ మురళీ మనోహర్ గారు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. అలాంటి క్రియేటివ్ పర్సన్ భావోద్వానికి గురయ్యారంటే మూవీ కోసం ఎంత తపన పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కృష్ణ సౌరభ్ పాటలతోనే కాదు తన బీజీఎంతో కూడా మూవీని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ మూవీలో నేను ఒక సాంగ్ రాసి పాడి కొరియోగ్రాఫ్ చేశాను. మా ప్రొడ్యూసర్స్  ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ లా మారిపోయారు. వాళ్లతో టూర్ చేసినట్లు షూటింగ్ కంప్లీట్ చేశాం. ఎక్కడా మాకు స్ట్రెస్ ఇవ్వలేదు. మా మూవీని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
 
హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ -  ఇందులో మూడు నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కూడా కనిపిస్తా. ఓల్డ్ ఏజ్ గెటప్ కోసం చాలా కష్టపడాల్సివచ్చింది. డైరెక్టర్ మురళీ, ప్రొడ్యూసర్ అమర్ గారు మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఎక్కడా ఒత్తిడి లేకుండా షూటింగ్ జరిగేలా చేశారు. వాళ్లకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. మా అమర్ గారు మంచి యాక్టర్ కూడా. నెక్ట్స్ నటుడిగా ప్రయత్నించాలని కోరుతున్నా. రీసెంట్ గా మేము ప్రమోషనల్ టూర్స్ వెళ్లినప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వైజాగ్ ఆడియెన్స్ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు. కృష్ణ సౌరభ్ మ్యూజిక్ మా మూవీకి హైలైట్ అవుతుంది. ఆయన ఫరియాతో పాడించినట్లు నాతోనూ ఒక పాట పాడిస్తారని అనుకున్నా. నిరంజన్ రాసిన కామెడీ పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఈ నెల 19న మా మూవీ రిలీజ్ కు వస్తోంది. మా సినిమా చూసి మీ రెస్పాన్స్ తెలియజేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
 
డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ - . తెలుగు ఆడియెన్స్ కు ఒక కొత్త తరహా సినిమా చూపించాలనే అందరం ఎఫర్ట్స్ పెట్టాం. కొత్త తరహా సినిమా అని ఎక్కడా మన నేటివిటీ దాటి వెళ్లలేదు. మా మూవీ టీమ్ లోని ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ దర్శకుడిగా నా ప్రయత్నానికి సపోర్ట్ గా నిలిచారు. వారందరికీ థ్యాంక్స్