1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. If not intrest not seen in theaters, but on OTT platforms either: JD Chakravarthy

JD Chakravarthy: నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు : జేడీ చక్రవర్తి

JD Chakravarthy
JD Chakravarthy
'గాయపడ్డ సింహం  డైరెక్టర్స్ ఫిల్మ్. ఇందులో నేను, తరుణ్ భాస్కర్, పవన్ సాదినేని లాంటి డైరెక్టర్స్ ఉన్నాము. కశ్యప్  చెప్పిన విధంగానే సినిమా తీశాడు. మేము ఇన్‌పుట్స్ ఇవ్వలేదు. ఆయన చెప్పినదే ఎగ్జాక్ట్‌గా తీసాడు. నాకు కథ వినగానే హిలేరియస్‌గా అనిపించింది. కథ విన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను అని సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి అన్నారు.
 
తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా జేడి చక్రవర్తి సినిమా విశేషాలు పంచుకున్నారు.  
 
ఇందులో ధర్మా పాత్ర చేయడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏంటి?
-క్యారెక్టర్ ఆర్క్‌లో ఏదైనా చాలెంజ్ ఉంటే ఏ నటుడికైనా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ధర్మా క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు ఒక విషయం చెప్పాను, మళ్లీ అదే చెబుతున్నాను. కమల్ హాసన్ గారు చేసిన క్యారెక్టర్లు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. అయితే ‘గాయపడ్డ సింహం’లో యాక్టర్‌గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను. అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాను.  
 
-ఒకే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో ఒక షేడ్, సెకండ్ హాఫ్‌లో మరో షేడ్ ఉండటం మామూలే. కానీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు షేడ్స్ లో కనిపించడం నన్ను చాలా ఎక్సైట్ చేసింది. అది ఎలా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అలా చేయడానికి నేను చాలా కష్టపడ్డాను అని చెప్పడం లేదు. కథలోనే ఆ బలం, మ్యాజిక్ కుదిరింది.
 
సినిమాలు చాలా నిదానంగా చేస్తుంటారు. కథల ఎంపికకు సమయం తీసుకుంటారా?
-నేను నా కెరీర్‌లో ఎప్పుడూ గబగబా సినిమాలు చేయలేదు. మొదటి నుంచి అలాగే చేస్తున్నాను. కథ నచ్చితేనే చేస్తాను.
 
కొన్ని సినిమాల్లో హీరో కంటే విలన్ క్యారెక్టర్ బాగా గుర్తుండిపోతుంది. ధర్మా క్యారెక్టర్ అలా వుంటుందా?
-కథ వర్క్ అవుట్ అయితేనే సినిమా ఆడుతుంది. ‘శివ’లో నా క్యారెక్టర్ నా పేరుగా మారిపోయింది. చక్రవర్తి అంటే గుర్తుపట్టరు, జేడీ చక్రవర్తి అంటే గుర్తుపడతారు. అలాగే భవాని, సత్య, భీకు మాత్రే, కల్లుమామ ఇలా చాలా పాత్రలు గుర్తుండిపోయాయి. కానీ కథ వర్కౌట్ కాకపోతే క్యారెక్టర్లు నిలవవు. ఒకవేళ నిలిచినా.. సినిమా ఆడదు. నా కెరీర్ లో ఫేవరెట్ క్యారెక్టర్ 'వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్'. ఆ పాత్ర వర్క్ అవుట్ అయ్యింది. కానీ సినిమా ఆడలేదు.
 
‘గాయపడ్డ సింహం’లో ఏ సింహం ఎక్కువ గాయపడింది?
-ఇందులో తరుణ్ భాస్కర్ గాయపడ్డాడు, నేను గాయపడ్డాను, ఇంకో సింహం కూడా గాయపడింది. ఆ సింహం ఎవరో త్వరలో రివీల్ చేస్తాం.
 
రాంగోపాల్ వర్మ ప్రభావం మీపై ఉందా?
-ఎవరితో పని చేస్తే వాళ్ల ప్రభావం కొంతవరకు ఉంటుంది కదా.
 
‘సత్య’ తర్వాత హిందీలో ప్రయత్నం చేయలేదా?
‘సత్య’ తర్వాత మేము ప్రొడక్షన్‌లో చాలా బిజీ అయ్యాం. అదే సమయంలో నన్ను ఎక్సైట్ చేసే స్క్రిప్ట్ కూడా రాలేదు.
 
ఓటీటీ ప్రభావం థియేటర్స్ పై ఉందా?  
ఓటీటీ వల్ల మంచి కంటెంట్ వస్తోంది. ఇప్పుడు సినిమా థియేటర్స్‌లో ఆడాలంటే కచ్చితంగా మంచి కంటెంట్ ఉండాలి. లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న సినిమాలు కూడా థియేటర్స్‌లో ఆడుతున్నాయి. ఇప్పుడు ఆడియన్స్‌కు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. సినిమా నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు. కానీ నచ్చితే మాత్రం ఓటీటీ వరకూ ఆగరు… వెంటనే థియేటర్‌కి వెళ్లి చూస్తారు. అదే మనిషి నైజం.
 
మళ్లీ ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలు చేస్తారా?
కచ్చితంగా చేస్తాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. హీరో, విలన్ అని బేరీజు వేసుకొను. కథ కొత్తగా ఉంటే చేయాలనిపిస్తుంది.
About Writer
దేవీ
తర్వాతి కథనం
SV Krishna Reddy: SV కృష్ణారెడ్డి వేదవ్యాస్ చిత్రం బేనర్ పూజకార్యక్రమాలు