సంబంధిత వార్తలు
- Allari Naresh: నాకంటే నా వైఫ్ ఆయనకు ఫ్యాన్ : అల్లరి నరేష్
- Thiruveer: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ల చిత్రం ఓ..! సుకుమారి షూటింగ్ పూర్తి
- Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్
- మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం
- Thiruveer: పాపం ప్రతాప్ కు ప్రశంసలే కాదు డబ్బులూ వస్తాయి : తిరువీర్
Sree Vishnu: నిజాయితీగల కంటెంట్ ఇస్తే శుక్రవారం మనదే అవుతుంది :శ్రీ విష్ణు
Thiruveer, Sree Vishnu, Payal Radhakrishna
ముఖ్య అతిధి శ్రీ విష్ణు మాట్లాడుతూ, .ఈటీవీ విన్ వారు చాలా అద్భుతమైన కంటెంట్లు పట్టుకొని అందరికీ అర్థమయ్యే, రియల్‌గా అనిపించే కంటెంట్‌ను తీసుకొస్తున్నారు. తిరువీర్ చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. ఆడియన్స్ సినిమాని ఇంకా ప్రమోట్ చేయాలని ఇస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను మనం ఇప్పుడు కూడా పాజిటివ్‌గా తీసుకోవాలి. మనం నిజాయితీగల కంటెంట్ ఇస్తున్నప్పుడు ఒక శుక్రవారం మనదే అవుతుంది. థియేటర్లు అన్నీ విపరీతంగా ఫుల్ అవుతాయి. ఆ రోజు ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. తెలుగు ఆడియన్స్ అన్నీ గమనిస్తుంటారు. టికెట్ 99 రూపాయలు మాత్రమే. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి థియేటర్‌కి వచ్చి చూడండి. కచ్చితంగా ఈ సినిమాతో మీరు సాటిస్ఫై అవుతారని నమ్మకం ఉంది. థియేటర్‌లో మా తిరువీర్ వీర ప్రతాపం చూపిస్తాడని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను దీవిస్తారని కోరుకుంటున్నాను. అని తెలిపారు.
హీరో తిరువీర్ మాట్లాడుతూ, మంచి సినిమా చేయడం ఒక ఎత్తు, దాన్ని జనం వరకు తీసుకురావడం మరో పెద్ద ఎత్తు అయిపోయింది ఈ రోజుల్లో. గత రెండు సినిమాల విషయంలో నేను బాధపడ్డాను. ఒక మంచి సినిమా చేసాం కానీ ఇంకా బాగా రీచ్ కాలేదు. గత సినిమా ప్రీ వెడ్డింగ్ షోకి మీడియా, క్రిటిక్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. కానీ జనానికి తెలిసేలోగానే సినిమా థియేటర్ నుంచి వెళ్లిపోయింది. ఓటిటీలో రెస్పాన్స్ బాగున్నప్పటికీ సినిమా థియేటర్‌లో ఆడితేనే బాగుంటుందని ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమా కోసం కథకి, క్యారెక్టర్‌కి దగ్గరగా ఉండే అన్ని ప్రమోషన్స్ చేశాను. ఈసారి జనానికి ఈ సినిమా వస్తుందని తెలిసిందని నమ్ముతున్నాను. ఈ సినిమాకి టికెట్ కూడా 100 రూపాయలు మాత్రమే. ఇది చాలా క్లీన్ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమా. ఫీల్ గుడ్ సినిమా. ఏప్రిల్ 17న మీ దగ్గరలో ఉన్న థియేటర్‌కి రండి. మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయను.
డైరెక్టర్ ఎస్.పి. దుర్గ నరేష్ మాట్లాడుతూ, ఈ సినిమా ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి తీసుకుని రాసిన కథ. ఈ సినిమా మీతో మాట్లాడుతుంది, మీరు మాట్లాడేలా చేస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది. మా డిఓపీ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఉన్న విజువల్స్‌కు ప్రాణం పోసింది. సురేష్ బొబ్బిలి గారు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తిరువీర్ గారు చాలా మంచోడు. నేను ఏం చెప్పినా చేశారు. నా తొలి సినిమాకి ఆయన దొరకడం నా అదృష్టం. శ్రీ విష్ణు గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన మా ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
