సంబంధిత వార్తలు
- Payal: ఆరోగ్యం బాగుంది - పంజాబీ, తమిళ చిత్రాల్లో బిజీ వల్లే తెలుగులో నటించడంలేదు : పాయల్
- Suri: మండాడి షూటింగ్ పూర్తి - శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు
- తండ్రీకూతుళ్ల బంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించే చిత్రం పిఠాపురంలో : నిర్మాతలు
- మత్స్యకారుల జీవితాలలో మరో కోణంగా తెరచాప చిత్రం రివ్యూ
- Rajendra Prasad: యువతరాన్ని హెచ్చరిస్తూ పిఠాపురంలో చిత్రం సిద్ధమైంది
రాయవలస నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి: కార్తీక్ జయంతి
Rayavalasa team
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. ఈ టీజర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. టీజర్ చాలా బాగుంది. కార్తీక్ హీరోగా, వాళ్ల అమ్మగారు డైరెక్టర్‌గా, వాళ్ల నాన్నగారు ప్రొడ్యూసర్‌గా ఉండడం చాలా క్రేజీగా అనిపించింది. రాధిక గారికి హ్యాట్సాఫ్. తనంత బాధ్యత తీసుకుని వాళ్ల అబ్బాయిని హీరోగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వారు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కార్తీక్ చాలా టాలెంటెడ్. యాక్టింగ్, సింగింగ్, ప్రొడక్షన్ ఇలా అన్ని విషయాల్లో తనకు పూర్తి అవగాహన ఉంది. ఈ సినిమాలో ఎన్నో విషయాలు తన దగ్గరుండి చూసుకున్నాడు. హీరోగా తనకి ఇది పెద్ద స్టెప్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీష స్క్రీన్‌పై చాలా అందంగా కనిపిస్తోంది. రవివర్మ గారు, అనిత గారు, అన్నపూర్ణమ్మ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా బాగుంటే తెలుగు ఆడియన్స్ భుజాన వేసుకుని తీసుకెళ్తారు. ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యూ” అన్నారు.
కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..“ కార్తీక్‌ని వాళ్ల తల్లిదండ్రులే ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేయడం విశేషం. తల్లి డైరెక్ట్ చేయడం, ఫాదర్ ప్రొడ్యూస్ చేయడం, కొడుకు హీరోగా చేయడం ఈ కాంబినేషన్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ ముగ్గురూ ఒకే ఫ్యామిలీ కావడం వల్ల సినిమా ఇంకా ఈజీ అయింది. 11 ఏళ్లుగా వీళ్లు షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఇప్పుడు సినిమాతో వస్తున్నారు. ఇలాంటి క్వాలిటీని నేను గత పదిహేనేళ్లుగా ఏ ఎన్నారైలోనూ చూడలేదు. తప్పకుండా వాళ్లు పడిన కష్టానికి ఫలితం ఉంటుందని నమ్ముతున్నాను.
డైరెక్టర్ రాధిక జయంతి మాట్లాడుతూ, మా అబ్బాయి ద్వారా నాకు ఈ అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. ఒక తల్లిగా కొడుకుని లాంచ్ చేయడం చాలా పెద్ద విషయం. నేను, కార్తీక్ ఫ్రెండ్స్‌లా ఉంటాం. కార్తీక్ చిన్నప్పటి నుంచే చాలా చురుకుగా ఉండేవాడు. సంగీతం నేర్చుకున్నాడు. చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చాడు. తనకి యాక్టింగ్ అంటే కూడా చాలా ప్యాషన్ ఉంది. నేను చేసిన మాయ ఫిలింకి యూఎస్‌లో మంచి అప్లాజ్ వచ్చింది. సినిమా తీయాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నాం. రాఖీ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సందర్భంగా రాఖీకి థాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాతో రాయవలస రాధికగా గుర్తింపు తెచ్చుకుంటానని నమ్మకం ఉంది. మా వారికి కథ నచ్చి ప్రొడ్యూస్ చేద్దామని చాలా ఎంకరేజ్ చేశారు. నా కలని, మా అబ్బాయి కలని నెరవేర్చడానికి మా వారు ఎంతగానో సపోర్ట్ చేశారు. మా టీమ్ మొత్తం అద్భుతమైన వర్క్ ఇచ్చారు. విజువల్స్, మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. అన్నీ కథకి తగ్గట్టుగానే ఉంటాయి. నటీనటులందరూ చాలా చక్కగా పర్ఫార్మ్ చేశారు. ఆకాష్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి థాంక్యూ. మా ఫస్ట్ లుక్‌ని బోయపాటి శ్రీను గారు లాంచ్ చేశారు. ఆయనకి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ శ్రీష మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థాంక్యూ. ఇది మంచి విలేజ్ డ్రామా. చాలా కొత్త కథతో వస్తోంది. నన్ను ఈ సినిమాలో రాణి పాత్రలో నమ్మి ఈ అవకాశాన్ని ఇచ్చిన రాధిక గారికి ధన్యవాదాలు. మా అందరికీ చాలా సపోర్ట్ చేశారు. నాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఎప్పటికీ కృతజ్ఞతలు ఉంటాయి. కార్తీక్ మల్టీ టాలెంటెడ్. తనకి సింగింగ్, డాన్స్ ఇలా అన్ని టాలెంట్స్ ఉన్నాయి. తను గొప్ప స్థాయికి చేరుకుంటాడని నమ్మకం ఉంది. అందరూ సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.
అనిత చౌదరి మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. కార్తీక్ చిన్నప్పటి నుంచి యూఎస్‌లో పెరిగాడు. రాధిక ఎప్పటినుంచో నాకు తెలుసు. తను జాబ్ చేస్తూ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఇప్పుడు డైరెక్టర్‌గా వస్తున్నారు. ఇండస్ట్రీలో మహిళా దర్శకులు తక్కువ. ఇప్పుడు రాధిక రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో నేను కార్తీక్ మదర్‌గా కనిపిస్తాను. చాలా అద్భుతమైన పాత్ర. తప్పకుండా ఈ సినిమాని మీ అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
యాక్టర్ రవివర్మ మాట్లాడుతూ..“ఇది డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ అందరికీ ఫస్ట్ సినిమా. కాబట్టి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. రాధిక గారు యూఎస్‌లో ఉంటారు. అక్కడే ఉండి సినిమా తీయడం చాలా కష్టం. వాళ్లు ఒక మంచి సినిమా తీసుకొస్తున్నారు. కార్తీక్ చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. రాధిక గారు తన అబ్బాయిని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసి లాంచ్ చేస్తున్నారు. చాలా ప్యాషన్‌తో చేసిన ప్రాజెక్ట్ ఇది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” అన్నారు.
నటీనటులు: కార్తిక్ జయంతి, శ్రీష , అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్, త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు
