శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2016 (14:44 IST)

చెర్రీ - సుకుమార్‌ల కొత్త చిత్రం టైటిల్... 'Facebook Live Chat @ 8.18PM'

మెగాహీరో రాంచరణ్ - దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం టైటిల్‌ను దర్శకుడు అపుడే ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం కథ కొనసాగనుంది. ఈ

మెగాహీరో రాంచరణ్ - దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం టైటిల్‌ను దర్శకుడు అపుడే ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం కథ కొనసాగనుంది. ఈ చిత్రానికి 'ఫేస్‌బుక్ లైవ్ చాట్ ఎట్ 8.18 పీఎం' అని పేరు పెట్టినట్టు ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ప్రస్తుతం యువత సోషల్ మీడియాలో ఎక్కువగా కాలం గడుపుతున్న నేపథ్యంలోనే సుకుమార్ ఈ టైటిల్‌ను పెట్టినట్టు తెలుస్తోంది. సినిమా టైటిల్ దగ్గరి నుంచి అవి ప్లే అయ్యే వరకు కొత్తగా ఆలోచించే సుక్కు.. ఆ దిశగానే ఈ టైటిల్‌ను ఫిక్స్ చేశాడని అంటున్నారు. అయితే ఆ టైటిల్‌ను పెడితే పెట్టాడులేగానీ.. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఎంతవరకు చేరువవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయట. ఆ టైటిల్‌తో కేవలం ఏ సెంటర్ ప్రేక్షకులకు చేరువవుతుందని అంటున్నారు.