వార్నీ... ఆ చిత్రంపై మోహన్ బాబు ఏమీ మాట్లాడకపోయినా బిగ్ న్యూసేనా?
మంచు మోహన్ బాబు గురించి వేరే చెప్పనక్కర్లేదు. సినిమాలు వేరు వ్యక్తిగత జీవితం వేరు అంటారాయన. సినిమాల గురించి మాట్లాడాల్సినప్పుడు మాట్లాడుతాం కానీ వ్యక్తిగతంగా పండుగలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేటపుడు సినిమాల గురించి మాట్లాడను అంటుంటారు. ఆమధ్య మంచు మనోజ్ విషయంలో గుచ్చిగుచ్చి ప్రశ్నించిన విలేకరులపై విరుచుకపడ్డారు. తమ వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు దూరుతున్నారంటూ మండిపడ్డారు. అయినప్పటికీ విలేకరులు మాత్రం ఆయనతో మాట్లాడించటానికి బాగా ఆసక్తి చూపిస్తుంటారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన మనశంకర ప్రసాద్ గారు చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌తో రికార్డు కలెక్షన్లతో దూసుకువెళ్తోంది. ఈ నేపధ్యంలో భోగి పండుగ చేసుకుంటున్న మంచు మోహన్ బాబును ఈ చిత్రం గురించి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... ఈరోజు భోగి పండుగ కనుక నేను సినిమాల గురించి మాట్లాడను అన్నారు. అంతే... అదే మాటను పట్టుకుని రకరకాల టైటిళ్లతో యూ ట్యూబ్ చానళ్లలో రకరకాల అర్థాలు తీస్తూ వీడియోలు లాగేస్తున్నారు. మొత్తమ్మీద మంచు మోహన్ బాబు గారు ఏమీ మాట్లాడకపోయినా బిగ్ న్యూస్‌లా మార్చేసారు.