1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Is Ram Charan going to do a new movie as a gangster?

Ramcharan New look: గ్యాంగ్ స్టర్ గా రామ్ చరణ్ కొత్త సినిమా చేయబోతున్నారా !

Ramcharan New look
Ramcharan New look
రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది షూటింగ్ లో వుంది. ఇక తాజాగా  ఏప్రిల్ నెల లో ఎస్క్వైర్ ఇండియా ఏప్రిల్ కవర్ పేజీపై కనిపించారు. హాంకాంగ్‌లోని విక్టోరియా హార్బర్‌లో జరిగిన ఫోటోషూట్‌లో రామ్ చరణ్ ఎస్క్వైర్ ఇండియా ఏప్రిల్ కవర్ పేజీపై కనిపించారు. రామ్ చరణ్ తన అద్భుతమైన ఆకర్షణ మరియు ఉనికితో ఎస్క్వైర్ ఏప్రిల్ కవర్‌ను తన సొంతం చేసుకున్నారు, ముఖం కనిపించకపోయినా ఆయన్ని గుర్తుపట్టవచ్చు.
 
కవర్ విడుదలకు ముందు పంచుకున్న టీజర్ చిత్రాలు అతని గ్యాంగ్‌స్టర్ లుక్‌ను ప్రదర్శిస్తున్నాయి. దానితో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో లుక్ గురించి తెగ సంబరపడుతున్నారు.ఇక ఆయన నటిస్తున్న పెద్ది సినిమా గురించి చెప్పాలంటే.. ఇంకా కొంత షూటింగ్ తోపాటు ప్రత్యేక గీతం కూడా షూట్ చేయాల్సి వుంది. ఇందుకు కసరత్తులు జరుగుతున్నాయి. కానీ ప్రత్యేక గీతంలో ఎవరు నటిస్తున్నారనేది ఇంకా క్లారిటీ రాలేదు. మానసా వారణాసి నటించనున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా మరో నటి పేరు కూడా పరిశీనలో వుంది. దీనిపై నిర్మాతలు ప్రకటించాల్సి వుంది.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Vishwak Sen: కొర‌టాల శివ క్లాప్‌ తో విశ్వ‌క్‌సేన్ సమర్పిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం