Ramcharan: రామ్ చరణ్ బంధువు మ్యాడ్ 3 చిత్రంలో ఓ హీరోగా చేస్తున్నాడా ?
మ్యాడ్ చిత్రం రెండు పార్ట్ లుగా విడుదలైన సక్సెస్ సాధించింది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కాంబినేషన్ లో మ్యాడ్ స్క్వేర్ కూడా విజయవంతం అయింది. కాగా, మ్యాడ్ 3 చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలకు ఆయనే దర్శకత్వం వహించారు. ఇక మూడో భాగానికి కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే, ఈ సినిమాలో అంతా కొత్తవారిని పరిచయం చేస్తూ దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రామ్ చరణ్ కు మేనేజర్ అయిన ప్రవీణ్ తనయుడు సాయి దీక్షిత్ ఈ సినిమాలో ఓ హీరోగా చేయనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరు కూడా కొత్తవారే. వారు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారసులుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు టైటిల్ పరంగా మ్యాడ్ జూనియర్స్ అనే పేరు పరిశీలనలో వున్నట్లు సమాాచారం.
సమాచారం మేరకు గచ్చిబౌలిలో ఓ కాలేజీలో గత కొద్దిరోజులుగా షూటింగ్ జరుపుకుంటోంది. కాలేజీ సన్నివేశాలు, క్యాంటిన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ ముగ్గురు హీరోలకు కొత్త వారు నాయికలుగా కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.