Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది
wedding anniversary - wedding Day
అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలోనూ బయట బంధువులు, స్నేహితులు తెలియజేస్తున్నారు. మార్చి 6, 2011 నుండి వివాహం చేసుకున్నారు, నేటితో 15 సంవత్సరాలు కలిసి జీవిస్తున్నారు. కాగా, ఇదే మార్చి 6, 2026న అల్లు శిరీష్ వివాహం జరగనుంది. హైదరాబాద్ లో ఓ స్టూడియోలో అంగరంగవైభవంగా జరగనున్న ఈ వేడుకకు సినీరాజకీయ ప్రముకులు సిద్ధమయ్యారు. నయనిక రెడ్డిని శిరీష్ వివాహం చేసుకుంటున్నారు.
హైదరాబాద్ కోకోపేటలో అల్లు స్టూడియోస్‌లో మార్చి 2న తెలుగు చిత్ర పరిశ్రమతో మా ప్రీ వెడ్డింగ్ వేడుకలను ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడానికి మేము సంతోషిస్తున్నాము అని తెలిపారు. అలాగే అంతకుముందు విదేశాల్లో కూడా వెడ్డింగ్ వేడుకను జరుపుకున్నారు. ఇక నేడు అసలైన వేడుక జరగనుంది. అల్లు అర్జున్, శిరీష్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని తమ జీవితాల్లోకి స్వీకరించడం విశేషం.
నువ్వు లేకుండా ఈ ప్రయాణం ఇంత గొప్పగా ఉండేది కాదు అంటూ శిరీష్ పోస్ట్ చేశారు. మార్చి 6న నయనిక నేను కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సన్నిహిత వివాహం చేసుకుంటున్నామ అని తెలిపారు.