1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. It makes me happy to hear everyone saying that Akhil has scored a hit.

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Nagarjuna, Akhil, shivaji, borse, bramhaji
Nagarjuna, Akhil, shivaji, borse, bramhaji
అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’.  భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది.
 
*నిర్మాత కింగ్ నాగార్జున మాట్లాడుతూ, లెనిన్’కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ జర్నీలో నందుని, నాగవంశీని, ఎడిటర్ నవీన్‌ని ఎక్కువగా కలిశాను. నందు, నవీన్ ఇద్దరూ సైకోలే (నవ్వుతూ). సినిమా పట్ల ఆ ఇద్దరికీ ఎక్కడా లేని పిచ్చి ఉంటుంది. నేను ఎన్ని సలహాలు, ఇన్ పుట్స్ ఇచ్చినా అర్థం చేసుకున్నారు. ఎన్నో వర్షెన్స్‌ రాశారు. డైలాగ్స్ ఎంతో బాగా రాశారు. ఎన్నో గొప్ప డైలాగ్స్ ఎడిట్‌లో పోయాయి. నందు.. ఊరికి గర్వంగా వెళ్లి.. త్వరగా ఇక్కడకు వచ్చేయ్. నవీన్ నూలి రెండు వారాలు ఎక్స్ ట్రా టైం అడిగితే ఇచ్చాం. ఆయన చెప్పిన 90 శాతం కరెక్షన్స్‌ను మేం చేశాం. మా అఖిల్‌ను బృందా మాస్టర్‌ సొంత కొడుకులా చూసుకున్నారు. భాగ్య శ్రీ బ్రిల్లియంట్‌గా నటించారు. ఆమె ఈ చిత్రానికి సోల్, హార్ట్ బీట్. ఈశ్వరీ గారు అందరినీ భయపెట్టారు. శివాజీ, బ్రహ్మాజీ అందరూ అఖిల్‌ను బిడ్డలా చూసుకున్నారు. నాగవంశీ ఈ సినిమాకి పిల్లర్. ప్రమోషన్స్ విషయంలో నాగవంశీ అంతా చూసుకున్నారు. నేను ఎవ్వరితోనూ భాగస్వామిగా వెళ్లను. కానీ నాగవంశీతో మున్ముందు పని చేయాలని కోరుకుంటున్నాను. అఖిల్‌కి చిన్నప్పటి నుంచి ఓ కసి ఉండేది. ఏదైనా సరే సాధించాలనే ఎనర్జీ, తపన ఉంటుంది.

మూడు, నాలుగు నెలల పసికందులా ఉన్నప్పుడు ఓ డాక్టర్ చూసి.. ఈ బిడ్డలో ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉండేది చెప్పారు. కాస్త నేల మీద పడుకోబెట్టండి.. అప్పుడే ఎనర్జీని నేల గ్రాబ్ చేస్తుందని అన్నారు. అంత ఎనర్జీ ఉన్న అఖిల్ ఈ మధ్య డల్ అయ్యాడు. ఒక్క అడుగు దూరంలో ఆగిపోతోన్నాడు. అన్ని సినిమాలకు ఒకేలా కష్టపడుతుండేవాడు. అఖిల్ అన్నింటినీ లోలోపలే దాచుకుంటాడు. అఖిల్ హ్యాండ్‌కి సర్జరీ అయినప్పుడు ఎంతో భయపడ్డాను. గాయం పూర్తిగా తగ్గి బయటకు వచ్చాక అఖిల్ పూర్తిగా మారిపోయాడు. ఎంతో ప్రశాంతమైన వ్యక్తిలా కనిపించాడు. తోడు కూడా వచ్చింది. ఇక అఖిల్‌కి గుడ్ టైం స్టార్ట్ అయిందని నాకు అనిపించింది. ఆ టైంలోనే ‘లెనిన్’ పనులు స్టార్ట్ అయ్యాయి. ఇదే థాట్ ప్రాసెస్, కామ్ నెస్‌తో ముందుకు సాగితే మరిన్ని విజయాలు వస్తాయని చెప్పగలను. థమన్ మాకు అద్భుతమైన పాటలు, ఫెంటాస్టిక్ బీజీఎం ఇచ్చారు. అఖిల్‌తో కూడా పాట పాడించాడు. వసంత్ పాత్రలో ప్రమోద్ అద్భుతం చేశాడు. పూనకం వచ్చినట్టుగా నటించాడు. అన్ని మార్కులు ప్రమోద్ కొట్టేస్తాడేమో అనుకున్నా. కానీ క్లైమాక్స్‌లో అఖిల్ అదరగొట్టేశాడు. మంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ హిట్ చేస్తారు. మా అక్కినేని ఫ్యాన్స్ మాత్రం.. అఖిల్ ఎప్పుడు వస్తాడా? హిట్ కొడతాడా?.. చైతన్య వస్తాడా? హిట్ కొడతాడా? అని ఎదురు చూస్తుంటారు. ‘తండేల్’ వచ్చినప్పుడు ఫ్యాన్స్ కాలర్ ఎగరేశారు. ఇప్పుడు ‘లెనిన్’ విషయంలో కాలర్ ఎగరేస్తున్నారు. మీడియా కూడా మాకు ఫుల్ పాజిటివ్‌గా సపోర్ట్ చేస్తోంది. ‘లెనిన్’ను సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
 
*హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ, నాగవంశీ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. భాగ్యశ్రీ గారితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఈశ్వరీ రావు గారు మాకు ఎంతో సహకరించారు. ఆర్టిస్టులంతా మాకెంతో సపోర్ట్ చేశారు. మా నాన్న గురించి మాట్లాడితే ఇంకా ఎమోషనల్ అవుతాను. మళ్లీ నేను ఎక్కువ టైం తీసుకోను. త్వరలోనే మరో కొత్త పాత్ర, కొత్త చిత్రంతో వస్తాను. మాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.
 
*నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘‘నిన్న (శుక్రవారం) ఉదయం నాలుగు గంటల నుంచే ‘లెనిన్’ సందడి మొదలైంది. గంటగంటకి బుక్ మై షోలో టికెట్లు తెగుతూనే ఉన్నాయి. తిరుపతిలోని 9 థియేటర్లలో ఆరు థియేటర్లలో సినిమా వేస్తే అన్నీ హౌస్ ఫుల్స్ పడ్డాయి. అందరూ స్క్రీన్స్ యాడ్ చేయమని అడుగుతున్నాను. సీడెడ్‌లో దాదాపు అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఊహించిన దానికంటే సినిమాకి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున గారి కంట్లోంచి నీళ్లు వచ్చాయి. ఈ సినిమా విజయం సాధించింది అని చెప్పడానికి అంతకంటే ఏం చూపించగలం. ఇన్నేళ్లలో నాగార్జున గారు అలా ఎమోషనల్ అవ్వడం నేను చూడలేదు. నాగార్జున గారు ‘లెనిన్’ విషయంలో  మాకెంతో సపోర్ట్ చేశారు. అన్ని విషయాల్లో మాకు ఫ్రీడం ఇచ్చారు. ఎడిటర్ నవీన్ సితార ఆఫీసులోనే ఎడిట్ చేశారు. నాగార్జున గారు నా కంటే ఎక్కువగా మా ఆఫీస్‌కి వెళ్లారు. తమన్ కూడా మాకు ఎప్పుడంటే అప్పుడు వచ్చి సపోర్ట్  చేశారు. నందు.. ఇప్పుడైనా బయటకు రా.. డైరెక్టర్ అని చెప్పుకోండి (నవ్వుతూ). సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరూ మనోడు హిట్టు కొట్టాడు.. అఖిల్ హిట్టు కొట్టాడు అని అంటుంటే ఆనందంగా ఉంది. రీల్స్, మీమ్స్‌లోనూ అదే కనిపిస్తోంది. అఖిల్ హిట్ కొట్టాలని ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. అన్ని ఏరియాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత గొప్ప విజయం అందించిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.
 
*దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ ‘‘నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నాగవంశీ గారు, నాగార్జున గారికి థాంక్స్. యుద్దమే కాదు.. సక్సెస్‌ని కూడా ప్రశాంతంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నాను. పదహారేళ్ల తరువాత నా సొంత ఊరికి గర్వంగా వెళ్తున్నాను. నాగార్జున గారే హీరో అనుకుని ప్రతీ సీన్‌ను వివరించేవాడ్ని. నన్ను ఈ జర్నీలో నాగార్జున గారు ఎంతో నమ్మారు. నవీన్ గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. మాకు తమన్ ఎంతో సహరించారు. బ్రిట్టోతో నాకు మంచి ర్యాపో ఉంటుంది. అఖిల్ చాలా మంచి వ్యక్తి. ఆయన డెడికేషన్ వల్లే ఇదంతా సాధ్యమైంది. భాగ్యశ్రీ గారు.. ఇకపై నవ్వుతూనే ఉండండి. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు. 
About Writer
దేవీ
తర్వాతి కథనం
Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ