జై బాలయ్య అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్న సఃకుటుంబానాం
Saha kutumbaanam relese poster
రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం సఃకుటుంబానాం. నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్ గా శశాంక్ మలి చేశారు. ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలు.
అయితే డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ తాండవం చిత్రం అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్న కారణంగా బాలయ్య గారి పై ఉన్న గౌరవంతో అఖండ 2 సినిమాకు మా సినిమా వల్ల ఎటువంటి చిన్నపాటి అంతరాయం కలవకూడదనే ఉద్దేశంతో మా సఃకుటుంబానాం చిత్రాన్ని డిసెంబర్ 19వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నందమూరి బాలకృష్ణ గారి అఖండ తాండవం చిత్రం ఒక విజయం సాధించాలని కోరుకుంటున్నాము.
కొన్ని నిర్ణయాలు వ్యాపారం కోసం కాదు, ఎమోషన్స్ కోసం. అదేవిధంగా ఈ నిర్ణయం కూడా "జై బాలయ్య" అనే తెలుగువారి నినాదం కోసం. మరొకసారి సఃకుటుంబానాం చిత్రం డిసెంబర్ 19వ తేదీన థియేటర్లలో ప్రేక్షకులు ముందుకు రానుందని తెలియజేసుకుంటున్నాము.