సంబంధిత వార్తలు
- కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు
- పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్
- పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్
- Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్
- Peddi: రామ్ చరణ్ తో ఐటెంసాంగ్ లో అలరించిన శృతి హాసన్, జాన్వీ కపూర్
'దేశీ ప్రిన్సెస్'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ 'దేశీ ప్రిన్సెస్'లా మెరిసిపోతోంది. రామ్ చరణ్ హీరోగా నటించిన "పెద్ది" చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. జూన్ 4వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, తాజాగా బెంగుళూరులో తన తాజా చిత్రం 'పెద్ది' ప్రమోషన్లలో భాగంగా, ఆమె ధరించిన ఒక ప్రత్యేక డ్రెస్ ఇపుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సంప్రదాయ బెనారసీ వస్త్రానికి ఆధునిక హంగులు జోడించి రూపొందించిన గౌనులో జాన్వీ అచ్చం దేశీ ప్రిన్సెస్‌లా మెరిసిపోయారు.
సాధారణంగా బెనరాసీ అంటే చీరనే గుర్తుకు వస్తుంది. కానీ, జాన్వీ కపూర్ దానికి భిన్నంగా స్ట్రాప్‌లెస్ గౌనును ఎంచుకున్నారు. కార్పెట్ తరహా బాడీస్‌తో, ఫిట్‌గా ఉండే ఈ గౌను ఆమె అందాన్ని మరింత పెంచింది. లేత గులాబీ, మింట్, ఐవరీ వంటి పాస్టెల్ రంగుల కలయిక, బంగారు వర్ణంతో నేసిన పూల డిజైన్లు ఈ డ్రెస్‌కు ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెట్టాయి. దీనికి జతగా చేతులపై కప్పుకున్న షీర్ పాస్టెల్ దుపట్టా రాజసమైన లుక్‌ను ఇచ్చింది.
ఈ డ్రెస్‌కు తగ్గట్టుగా అక్సీడైజ్డ్ సిల్వర్ జుంకాలు, స్టేట్మెంట్ ఇయర్ ఆఫ్ వంటి మినిమల్ యాక్సెసరీస్ ధరించారు. నుదట పాపిడితో వేసిన స్లీక్ బన్, గ్లోయీ మేకప్‌తో తన లుక్‌ను పూర్తి చేశారు. ఇటీవలే పర్పుల్ లెహంగాతో వైరల్ అయిన జాన్వీ, ఇపుడు ఈ బెనారసీ గౌనులో సంప్రదాయ వస్త్రకళకు, ఆధునిక ఫ్యాషన్‌కు మధ్య అద్భుతమైన బ్యాలెన్స్ ఎలా సాధించవచ్చో నిరూపించారు.
