తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్
కోలీవుడ్ అగ్రహీరో, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌కు కుటుంబ కలహాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. విజయ్ నుంచి తనకు విడాకులు కావాలంటూ ఆయన సతీమణి సంగీత విజయ్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... విజయ్ నేరుగా హాజరై విచారణ ఇవ్వాలంటూ ఆదేశించింది. తాజాగా విజయ్ కుమారుడు జాసన్ విజయ్ కూడా తండ్రికి షాకిచ్చారు. విజయ్‍కు చెందిన ఇన్‌స్టా ఖాతాను జాసన్ విజయ్ అన్‌ఫాలో చేశారు. తన తల్లికి ఎదరవుతున్న పరిస్థితులకు చలించిపోయిన సంజయ్.. ఆమెకు అండగా నిలబడే క్రమంలో తన తండ్రి విజయ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‍ఫాలో చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
ఒక తండ్రిగా, ఒక ఎదుగుతున్న రాజకీయ పార్టీ అధినేతగా విజయ్‌కు ఇది కోలుకోలేని దెబ్బే అని ఆయన సన్నిహితులతో పాటు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, విజయ్ మాత్రం కుటుంబ కలహాలను పక్కనబెట్టి తన రాజకీయ లక్ష్యంపైనే దృష్టిసారించారు. ఇన్ని అవరోధాల మధ్య కూడా పార్టీని బలోపేతం చేసే పనిలో ఆయన నిమగ్నంకావడం విశేషం. దళపతికి మద్దతుగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తమిళ ప్రజల సంక్షేమం కోసం విజయ్ వెనుకడుగు వేయరని, ఆయన వెంటే తాము ఉంటామని వారు ప్రకటించారు.