Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ
Jayasudha as grandmother
ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు ఈ చిత్రం నుంచి సహజ నటి జయసుధ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాలో అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో జయసుధ ఆకట్టుకోనున్నారు. ప్రేమానురాగాలు పంచే అమ్మమ్మ సుశీలమ్మ పాత్ర ప్రేక్షకుల మనసుకి హత్తుకోనుంది.
నటీనటులు - రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్, తదితరులు
