యాంకర్ విష్ణుప్రియతో నాకు పెళ్లా.. ఎవరు చెప్పారు? జేడీ చక్రవర్తి ప్రశ్న
ప్రముఖ టాలీవుడ్ నటుడు జేడీ చక్రవర్తి బుల్లితెర యాంకర్ విష్ణుప్రియను వివాహం చేసుకోబుతున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై జేడీ చక్రవర్తి స్పందించారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ కేవలం పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు. విష్ణుప్రియ తనకు కేవలం ఒక ప్రియ శిష్యురాలు మాత్రమేనని, తమ మధ్య అంతకుమించిన సంబంధం లేదని స్పష్టం చేశారు. తన తాజా చిత్రం 'గాయపడ్డ సింహం' ప్రమోషన్‌లో భాగంగా, ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విష్ణుప్రియ నా శిష్యురాలు. ఆమె నాకు ఫోన్ చేసినపుడు గురువుగారు అనే మాట్లాడుతుంది. అలాంటి అమ్మాయికి నాకు ఎఫైర్ ఉందని ప్రచారం చేయడం కంటే దుర్మార్గం మరొకటి లేదు. మాది పవిత్రమైన గురుశిష్యుల బంధం అని జేడీ చక్రవర్తి వివరించారు. దాదాపు మూడేళ్లుగా తాను విష్ణుప్రియను కలవలదేని ఆయన తెలిపారు.
కాగా, గతంలో ఓ టీవీ షోలో విష్ణుప్రియ మాట్లాడుతూ, జేడీ చక్రవర్తి అంటే తనకు ఇష్టమని, ఆయన తల్లి అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని సరదాగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు పట్టుకుని సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. అయితే, ఆ తర్వాత విష్ణుప్రియ కూడా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తన దృష్టంతా కెరీర్‌పైనే ఉంటుందని స్పష్టం చేశారు. తాజాగా జేడీ చక్రవర్తి కూడా ఈ విషయంలై క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ ప్రచారానికి తెరపడినట్టయింది.
