చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్.. వాళ్లను వదిలిపెట్టనంటూ జూ. ఎన్టీఆర్ మండిపాటు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను కొందరు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. దేవర చిత్రంలోని చుట్టమల్లే పాటను మార్ఫింగ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన ఆ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియోను రూపొందించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టనంటూ హెచ్చరించారు. వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. అలాగే, మరో హీరో విజయ్ దేవరకొండ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ పోస్టును 'ఎక్స్' ఖాతాలో ఓ పోస్ట్ చేస్తూ.. ' అసహ్యకరమైన, రోత పుట్టించే మరియు సిగ్గుమాలిన చర్య. స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే, 'మాతృదేవో భవ' అనేది కేవలం ఒక మాట మాత్రమే కాకుండా మన సంస్కృతిలో భాగమైన ఈ గడ్డపై, కొందరు వ్యక్తులు ఎంతగా దిగజారిపోయారంటే, ఒక స్త్రీని అత్యంత నీచమైన రీతిలో అవమానించడానికి ఏఐ (AI)ని ఉపయోగిస్తున్నారు. ఇంతటి నీచమైన దాన్ని సృష్టించడానికి ఏఐని ఉపయోగించడం మాటల్లో చెప్పలేనంత సిగ్గుచేటు.
ఈ మార్ఫింగ్ చేసిన 'చుట్టమల్లె' వీడియో వెనుక ఉన్న నీచులారా, మీలో ఎవరినీ నేను వదిలిపెట్టను. దీన్ని సృష్టించిన వారిపైనా, వ్యాప్తి చేస్తున్న వారిపైనా సాధ్యమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. దయచేసి ఇలాంటి కంటెంట్‌ను చూడవద్దు, పంచుకోవద్దు లేదా దానితో సంబంధం పెట్టుకోవద్దు. ఈ రోజు మరొకరు. రేపు మీ తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె కావచ్చు. ఇది ఒక తీవ్రమైన సమస్య, ఏఐ దుర్వినియోగానికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకుని, కఠినమైన నిబంధనలను తీసుకురావాలని నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను' అని పేర్కొన్నారు.

