1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kangana Ranaut Criticizes KD Song for Bollywood Vulgarity

ప్రేక్షకులను ఆకర్షించేందుకు హద్దులు దాటేస్తున్నారు.. నియంత్రణ ఉండాల్సిందే.. కంగనా రనౌత్

Kangana Ranaut
ప్రేక్షకులను ఆకర్షించేందుకు సినిమాల్లో అశ్లీలత హద్దులు దాటుతోందని, అందువల్ల సినిమాల్లో శృంగారంపై హద్దులు ఉండాల్సిందేనని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అంటున్నారు. 'కేడీ ది డెవిల్' అనే కన్నడ చిత్రం కోసం రూపొందించిన హిందీ పాట వివాదాస్పదంగా మారింది. ఈ పాటలోని సాహిత్యం పచ్చిగా, ద్వంద్వార్థాలతో ఉండటంతో నెటిజన్లే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇపుడు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించారు. 
 
బాలీవుడ్ తన స్థాయిని దిగజార్చుకుంటూ ప్రేక్షకులను ఆకర్షించడం కోసం అన్ని హద్దులు దాటేస్తోందని ఆరోపించారు. చౌకబారు ట్రిక్కులతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్న సినీ పరిశ్రమ తీరును దేశమంతా ఛీకొడుతున్నా.. వారికి ఏమాత్రం సిగ్గు ఉన్నట్టు అనిపించడం లేదని ఆమె మండిపడ్డారు. ఇలాంటి అభ్యంతరకర ప్రదర్శనలకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వం బాలీవుడ్‌పై ఖచ్చితంగా కఠినమైన నియంత్రణ విధించాలని అపుడే ఈ అశ్లీలతకు ఎండ్ కార్డు పడుతుదని కంగనా గట్టిగా కోరారు. 
తర్వాతి కథనం
రేణూ దేశాయ్‌కి సోషల్ మీడియాలో వేధింపులు: ఇద్దరు అరెస్ట్