సంబంధిత వార్తలు
- Satyadev :రావు బహదూర్ నుంచి సత్యదేవ్, దీపా థామస్ పై రొమాంటిక్ సాంగ్
- నిర్మాత మేనేజర్ లా వ్యవహరిస్తేనే లాభపడతాడు :చింతా గోపాల కృష్ణా రెడ్డి
- Satya Dev: వసుదేవసుతం టీజర్ ను అభినందించిన సత్య దేవ్
- Satya Dev: శ్రీ చిదంబరం కథను నాకు ముందు చెప్పారు : సత్య దేవ్
- Lakshmi Manchu: అజయ్ దిషన్, ధనుష, లక్ష్మి మంచు, సునీల్ కాంబినేషన్ చిత్రం బూకీ ప్రారంభం
Satya Dev నా నుండి మరో సినిమా చూడాలని కీరవాణి గారు అడిగారు : వెంకటేష్ మహా
Venkatesh Maha, Satya Dev, Deepa Thomas
స్మరణ్ సాయి మృదువైన స్వరాలతో, ఆహ్లాదకరమైన నేపథ్యంతో ఈ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచారు. ఈ కంపోజిషన్ నెమ్మదిగా చిత్రంలోని వింటేజ్ భావాన్ని ప్రతిబింబించే వాతావరణాన్ని సృష్టిస్తుంది. రచయిత రెహ్మాన్ భావోద్వేగంతో నిండిన పదాలతో ప్రేమలోని ఆరాధనను, మనసులోని సున్నితమైన భావాలను అందంగా వ్యక్తీకరించారు.
విజయ్ యేసుదాస్ తన హృద్యమైన వోకల్స్ తో ఈ పాటను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఆయన స్వరం మెలోడీలో సునాయాసంగా ప్రయాణిస్తూ మధుర అనుభూతిని కలిగిస్తుంది. దర్శకుడు వెంకటేశ్ మహా అభిరుచి ఈ పాటలోని విజువల్స్ , భావోద్వేగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సత్యదేవ్, దీపా థామస్‌ల ఆకట్టుకునే ఆన్‌స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ పాటకు ప్రత్యేకమైన వింటేజ్ అందం వచ్చింది.
సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ, దాదాపు ఐదేళ్ళ తర్వాత నా సినిమాకి జరుగుతున్న తొలి ఈవెంట్ ఇది. ఈ సినిమా ప్రాసెస్‌కు ఐదేళ్లు పట్టింది. ఒక రోజు కీరవాణి గారు ఫోన్ చేసి “మళ్లీ నీ సినిమా చూడాలని ఉంది, మరో సినిమా తీయవా?” అని అడిగారు. అదే రోజు అనురాగ్, శరత్ కూడా ఫోన్ చేసి నా విజన్‌పై నమ్మకం వ్యక్తం చేశారు. మహేష్ బాబు గారు, నమ్రత గారు కథ విని ఓకే చెప్పగానే మేము మొదలుపెట్టాం. గోపాలకృష్ణ గారు రావడంతో పని ఇంకా సులభమైంది. మహేష్ గారు నమ్రత గారు, శరత్, అనురాగ్. గోపాల్ కృష్ణ గారు నాకు ఫైవ్ అవెంజర్స్. సత్య నా క్రియేటివ్ సోల్‌మేట్. ఈ సినిమా కోసం సత్య ప్రతిరోజూ ఐదు గంటల పాటు మేకప్ వేసుకునేవారు. ఈ పాత్ర కోసం ముప్పై టేకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సత్యలాంటి నటుడు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను.. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా మీకు ఇచ్చిన అనుభూతికి పది రెట్లు అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో రావు బహదూర్ తీశాను. ఈ సినిమా మీ అందరికీ మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తుందని నమ్ముతున్నాను.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ, ఓ సుందరి పాట వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నేను సినిమాలకు వచ్చిన కొత్తలో కమల్ హాసన్ గారి లాంటి పాత్రలు ఎప్పుడైనా వస్తుందా అని అనుకునేవాడిని. ఒక రోజు వెంకటేష్ మహా ఈ కథ చెప్పారు. షూటింగ్ మొదటి రోజు ఉదయం మూడు గంటలకు సెట్‌లోకి వెళ్లి రాత్రి రెండు గంటల వరకు షూటింగ్ చేశాను. ఇలా ఐదు రోజులు గడిచాక టెన్షన్ వచ్చి “ఇంకా ఎన్ని రోజులు ఇలా?” అని అడిగాను. దాదాపు 85 రోజులు అని చెప్పారు. అప్పుడు నా పని అయిపోయింది అనుకున్నాను. అలాంటి సమయంలో ఓ సుందరి పాట వినిపించారు. ఆ పాట మాకు డిటాక్స్‌లా అనిపించింది.
ఈ పాట మహిళలను సెలబ్రేట్ చేసేలా ఉంటుంది. మా నిర్మాతలు ఇంత ఆనందంగా ఉన్నారంటే, దర్శకుడు మహా ఎంత అద్భుతంగా ఈ సినిమా తీశాడో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి, అవతార్ లాంటి సినిమాలు ఆ స్కేల్లో ఎలా అయితే మిమ్మల్ని కూర్చోబెట్టగలిగాయో మా రావు బహుదూర్ సినిమా కూడా మిమ్మల్ని అంతే స్థాయి లో అలరిస్తుంది. ఇది నా ప్రామిస్. ఈ సినిమా మీ అందరినీ మెస్స్మరైజ్ చేస్తుంది. ఇది నా హామీ. వెంకటేష్ మహా ఒకసారి మాటిస్తే తప్పే రకం కాదు. దేశం మొత్తం తిరిగి ఈ కథ రాశాడు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు మహాను సెలబ్రేట్ చేస్తారు. రామప్ప పాత్ర కోసం ప్రతిరోజూ ఐదు గంటల మేకప్ పట్టేది. సీతమ్మ వాకిట్లో సినిమాలో మహేష్ గారితో కలసి నటించాను. కానీ సినిమాలో ఆ సీన్ కొన్ని కారణాల వలన ఉంచడం కుదరలేదు. ఇప్పుడు మహేష్ బాబు గారు నా సినిమాను ప్రజెంట్ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా మా టీమ్‌కు మంచి పేరు తీసుకువస్తుంది. స్మరణ్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విజయ్ గారు ఈ పాట పాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు రావు బహదూర్లాంటి సినిమా ఇచ్చిన మహాకు ధన్యవాదాలు.
