1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Keerthy Suresh reveals she stayed awake for 41 hours while juggling multiple film shoots

Keerthy Suresh: నిద్రలేని రాత్రులు గడుపుతున్న కీర్తి సురేష్..?

Keerthy Suresh
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నిద్రలేని రాత్రులు గడుపుతోంది. ఇందుకు కారణం బిజీ షెడ్యూల్. వరుస సినిమా షూటింగ్స్ కారణంగా తాను ఏకంగా 41 గంటల పాటు నిద్ర లేకుండా పనిచేశానని కీర్తి సురేష్ తెలిపారు. షూటింగ్ సెట్స్‌లో గడిపిన క్షణాలను పంచుకుంటూ, అలసట కంటే పని చేసే అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందనే భావాన్ని ఆమె వ్యక్తం చేశారు. 
 
కీర్తి సురేష్ పోస్ట్ చూసిన అభిమానులు మాత్రం ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరైన విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్.. బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
'ఛత్రపతి' విలన్ ఇకలేరు.. కేన్సర్‌తో ముంబైలో కన్నుమూత