Naresh: చీరలు కట్టుకొచ్చారు, ఇంకేం హగ్ చేసుకునేది: సీనియర్ నరేష్
Shivani Nagaram, Anchor Sravanthi Huged each other under direction of Senior Naresh
ఈరోజు ఓ ఆసక్తికర సంఘటన హే భగవాస్ సినిమా వేడుకలో జరిగింది. స్టేజీపైన యాంకర్, నటి కూడా పాల్గొన్నారు. సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. స్టేజీపైన నరేశ్ మాట్లాడుతూ, అమ్మా మీ ఇద్దరిని హగ్ చేసుకోవాలనుంది. కానీ మీరు చీరలో వున్నారు. ఇటీవలే ఒక సంఘటన (శివాజీ హీరోయిన్ల డ్రెస్) తర్వాత చాలా మంది స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు, అది మన భారతీయ సంస్కృతి.
మన సంస్కృతి ప్రకారం మగ వాళ్ళు ఆడవాళ్ళను హగ్ చేసుకోకూడదు కనుక. మీ ఇద్దరూ హగ్ చేసుకోండి నటీమణులు శివానీ, స్రవంతిలను ఉద్దేశించి అన్నారు. వారిద్దరూ హగ్ చేసుకునేలా చేశారు నరేశ్. అనంతరం ఆయన మాట్లాడుతూ, యాంకర్ గీతా భగత్ నుద్దేశించి దూరం నుంచైనా నీకు హగ్ డే అంటూ అన్నారు. అదేవిధంగా నిర్మాతలు రేపు ఫంక్షన్ పెడితే బాగుండేదని అన్నారు. రేపు ఏమిటి? అంటే.. కిస్ డే అన్నారు.కనుక ఈరోజే పెట్టడమే బెటర్ అన్నారు. దానితో గీతా భగత్ ఓరి దుర్మార్గుడా.. అంటూ నరేశ్ ను ఉద్దేశించి సరదాగా కామెంట్ చేసింది. ఏది ఏమైనా హగ్ డే రోజు సినిమాట్రైలర్ విడుదలచేయడం బాగుంది అని ముగించారు నరేశ్.