శనివారం, 18 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 14 మార్చి 2026 (12:37 IST)

Varun Tej: కొరియన్ ఫుడ్ తింటూ షూటింగ్ కు సిద్ధమవుతున్న కొరియన్ కనకరాజ్

Varun Tej at Korea
Varun Tej at Korea
గత రాత్రి వరుణ్ తేజ్ కొరియా నుండి కొన్ని సహజమైన చిత్రాలను పంచుకున్నారు. ఆయన నటిస్తున్న చిత్రం కొరియన్ కనకరాజ్. ఈ చిత్రం చివరి షెడ్యూల్ శనివారంనాడు ప్రారంభమవుతుంది. కనుక  కొరియాలో అక్కడి స్థానికులతో కలిసి సరదాగా గడుపుతున్న కొన్ని క్యాండిడ్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
 
ఈ చిత్రం హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ భిన్నమైన గెటప్ లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవలే గ్లింప్స్ విడుదలయింది. మంచి స్పందన వచ్చింది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.