బుధవారం, 18 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : బుధవారం, 3 డిశెంబరు 2025 (17:37 IST)

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Monalisa - Life Cinema
Monalisa - Life Cinema
కుంభమేళా ఫేమ్ మోనాలిసా కథానాయికగా నటిస్తున్న చిత్రం లైఫ్. సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అంజన్న నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు మేకర్స్.
 
ఈ చిత్రంలో సయాజీ షిండే, సీనియర్ నటుడు సురేష్, ఆమని, తులసి, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మురళీ మోహన్ రెడ్డి డీవోపీగా పని చేస్తున్నారు. సుకుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. బేబీ సురేష్ ఆర్ట్ డైరెక్టర్.
 
నటీనటులు: మోనాలిసా భోంస్లే, సాయి చరణ్, సయాజీ షిండే, సీనియర్ నటుడు సురేష్, ఆమని, తులసి, వినయ్, రచ్చ రవి, దేవి, శ్రుతి, రోహిత, సుష్మ, బోస్, బార్బీ