ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మార్చి 2026 (21:42 IST)

Monalisa Bhosle: కేరళలో ప్రియుడిని పెళ్లాడిన మహా కుంభమేళా గర్ల్ మోనాలిసా (video)

Monalisa
Monalisa
మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో ఒక్క సారిగా వైరల్ అయిపోయింది మధ్యప్రదేశ్ యువతి మోనాలిసా భోన్‌స్లే. తన తేనె కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మోనాలిసా ఊహించని షాక్ ఇచ్చింది. ఫేస్‌ బుక్ ద్వారా పరిచయమైన కేరళ యువకుడు ఫర్మాన్ ఖాన్‌తో ఆమె ఏడాదిన్నరగా ప్రేమాయణం సాగిస్తోంది. 
 
అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో ప్రియుడి కోసం ఆమె తిరువనంతపురం చేరుకుంది. తమకు రక్షణ కల్పించాలని ఈ జంట కేరళ పోలీసులను ఆశ్రయించింది. ఆపై తన వ్యక్తిగత జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లుగానే, ఆమె తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఈ వివాహం, కుటుంబ సభ్యుల వ్యతిరేకత, తండ్రి నుండి ఎదురైన ఒత్తిడి నేపథ్యంలో పోలీసుల భద్రత మధ్య ఈ వివాహం జరిగింది.