1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kumkum Bhagya Actor Sanchita Ugale's Last Instagram Post Goes Viral, Internet Says She Looked Happy

ముంబైలో బుల్లితెర నటి సంచిత ఉగలే ఆత్మహత్య

sanchita ugale
బాలీవుడ్ బుల్లితెర ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. బుల్లితెర నటి సంచిత ఉగలే ఉత్మహత్య చేసుకుంది. పలు టీవీ సీరియళ్ళలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ నటి వయసు 22 సంవత్సరాలు. ముంబై శివారులోని నాలాసోపరాలో గల తన నివాసంలో ఆదివారం రాత్రి ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ప్రాథమిక విచారణ అనంతరం ఆమెది ఆత్మహత్యగా ధృవీకరించారు. పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల మధ్య సంచిత తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుని చూసేసరికి ఆమె చీరతో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. 
 
సంచిత 'కుంకమ్ భాగ్య', 'దిల్వాలీ దుల్హా లే జాయేంగే', 'వాగ్లే కీ దునియా' వంటి ప్రజాదారణ పొందిన సీరియల్స్‌తో పాటు 'చావా' అనే చిత్రంలో నటించి గుర్తింపు పొందారు. ఆమె ఆకస్మిక మరణవార్తతో టీవీ పరిశ్రమల దిగ్భ్రాంతికి లోనైంది. అయితే, గత కొంతకాలంగా ఆమె తీవ్రమైన మానసిక సమస్యలతో పాటు కుంగుబాటుతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు కూడా ఆమె తన ఇన్‌స్టా పేజీలో ఎంతో ఉల్లాసంగా ఉన్న ఫోటోను షేర్ చేయడం గమనార్హం. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మహిళా సాధికారత నేపథ్యంలో అభ‌య‌ మూవీ నాలుగు భాష‌ల్లో రిలీజ్