మంగళవారం, 21 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 12 ఫిబ్రవరి 2026 (11:42 IST)

Ramcharan: పెద్ది చిత్రంలోని రెండవ పాట గురించి తాజా సమాచారం

Ramcharan, Buchibabu
Ramcharan, Buchibabu
రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి విడుదల కానున్న రెండో పాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు స్వల్ప ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. ఇటీవలే చికిలి.. చికిలి.. సాంగ్ కు అనూహ్యస్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో పాటను మరింత క్రేజ్ తెచ్చేలా చిత్రీకరిస్తున్నారు. సమాచారం మేరకుక ఈ పాట ఈ వారం విడుదల అవుతుందని తొలుత సమాచారం వచ్చినప్పటికీ, నిర్మాతలు ఈ వారం పాటను విడుదల చేయడం లేదని తెలుస్తోంది. 
 
కనుక ఆ పాట ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో విడుదల కావచ్చని అంచనా. అయితే, ఇప్పటివరకు నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.ఇక సినిమా పరంగా చెప్పాలంటే, స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు సనా బుజ్జిబాబు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అందుకోసం దేవుడి పూజ తర్వాత షూటింగ్ వెలుతాడని ఇటీవలే బుజ్జిబాబు ప్రకటించారు. రామ్ చరణ్ తో తను వున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.
 
కాగా, ఈ సినిమా 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కూడా అదే నెలలో ప్రకటించడంతోపాటు కానీ కొన్ని రోజుల క్రితం నిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేసి, 2026 ఏప్రిల్ 30న విడుదల చేస్తామని ప్రకటించారు.