1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Latest update on 'Fauji': Prabhas as a soldier fighting against the British for the sake of his homeland.

Fauj Latest update :: స్వదేశం పక్షాన ఆంగ్లేయులతో పోరాటానికి దిగిన ఫౌజీ గా ప్రభాస్

Prabhas Fauj Latest update
Prabhas Fauj Latest update
కౌరవ పక్షాన నిలిచిన కర్ణుడు...ధర్మ పక్షాన నిలిచిన అర్జునుడు... కానీ...స్వదేశం పక్షాన నిలిచిన ఫౌజీ. అంటూ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రంపై ఆసక్తికరమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో ప్రభాస్ టీమ్ విడుదల చేసింది. ఆంగ్లేయుల కాలం నాటి గాధగా ఈ చిత్రం రూపొందుతోంది. దేవాలయం ప్రవేశానికి వారు అడ్డంకిగా వుండడంతో వారిని ఎదురొడ్డి ప్రజల పక్షాన నిలిచిన ఫౌజీ గా ప్రభాస్ పై పోరాట సన్నివేశాలు నిన్ననే ప్రారంభమయ్యాయి.
 
ఈ సన్నివేశంలో అప్పటి కాలం నాటి వస్త్రాలు ధరించి పూజారి గెటప్ లో ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. ఈ స్టిల్ నేడు విడుదలైంది. ఇలా షూటింగ్ జరుగుతుందని వెబ్ దునియా పాఠకులకు తెలిసిందే. 
 
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా  హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఫౌజీ. కొద్దిరోజులుగా హైదరాబాద్ లోని కోకాపేటలో చిత్రీకరణ జరుగుతోంది. భారతదేశానికి స్వాంత్రత్యానికి పూర్వం ఓ సైనికుడి గాధతో ఈ సినిమా రూపొందుతోందని తెలిసింది. ఇందులో పలు షేడ్స్ వున్న పాత్రను తను పోషిస్తున్నాడు. ప్రభాస్ కు తల్లిదండ్రులుగా మిథున్ చక్రవర్తి, జయప్రద నటిస్తున్నారు. 
 
గత కొద్దిరోజులుగా కోకాపేటలో షూట్ జరుగుతోంది. ఓ దేవాలయంలో బ్రాహ్మణుల వేడుక చేసుకుంటుండగా బ్రిటీషర్స్ సైనికులు వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తుండగా, బ్రాహ్మణుడి గెటప్ లో ప్రభాస్ వచ్చి వారిని కాపాడే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
 
ఫైట్ మాస్టర్లు రామ్ లక్మణ్  ఆధ్వర్యంలో యాక్షన్ పార్ట్ చిత్రీకరణ సాగుతోంది.  ఇలా దేశభక్తి గాధకు సంప్రదాయానికి పెద్ద పీట వేసే చిత్రంగా రూపొందుతోంది.  ఈ సినిమా, 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 
నటి ఇమాన్వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే చిత్రం గురించి అప్ డేట్ కూడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చారు. "అజ్ఞాతపర్వం ముగిసింది. తిరుగుబాటు మొదలైంది. #Fauzi ప్రపంచవ్యాప్తంగా 2026 డిసెంబర్ 3న ఘనంగా విడుదల కానుంది," అని వారు పేర్కొన్నారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ రక్తంతో తడిసిపోయి, చేతిలో రైఫిల్ పట్టుకుని ఒక రాయిపై కూర్చుని కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ నేలపై అనేక మృతదేహాలు పడి ఉన్నాయి. "ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్" (A battalion who fights alone) అనే వాక్యం పోస్టర్‌పై ఉంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
రామాయణ గాథా చిత్రణ కారణంగా ఆదిపురుష్ పై మళ్లీ వ్యతిరేకత