NBK 111 Update: నందమూరి బాలకృష్ణ 111 చిత్రం తాజా అప్ డేట్
NBK 111 Fance poster
తమన్ కూడా నిన్ననే ఈ సినిమా గురించి స్పందిస్తూ, బాలయ్య సినిమాల్లో మరో కొత్త కోణంలో సంగీతం అందించానని చెప్పారు. ఇక అభిమానులయితే కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.. మహాపురుషులౌతారు... తరతరాలకీ తరగని వెలుగవుతారు. ఇలవేలుపులవుతారు.. అంటూ ఎన్.టి.ఆర్.సినిమాలోని పాటను కోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇదిలా వుండగా,: 'భగవంత్ కేసరి'లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటించారు. ఇప్పుడీ ఎన్.బి.కె 111లో వాళ్ళిద్దరి కలయికలో రెండో సినిమా. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు. సినిమా సెట్స్‌లో అడుగు పెట్టినట్టు ఆమె తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలుపుతూ, సినిమా తెరకెక్కుతున్న తీరుపై ఆమె ఎంతో ఉత్సాహంగా వున్నారు.. ''NBK111 ఓ న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా. ఇందులో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని కథను చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటుంది. మాస్ ప్రేక్షకులను అలరించడంతో పాటు న్యూ ఏజ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కుతోందని తెలిపారు.
