శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (12:25 IST)

రెండు జంట‌ల క‌థ‌తో `మ్యాడ్`

Madhav, Spandavali, Setavaram etc
ప్రస్తుత యువ‌త ఆలోచ‌న‌ల‌నుప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రూపొందిన చిత్రం "మ్యాడ్". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.  మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ  ప్రధాన పాత్రల్లో నటించారు. మోదెల టాకీస్  బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డ, మిత్రులు నిర్మాత‌లుగా  లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అతిథిగా హాజరై చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 
 
దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ, నేను సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చాను. మేము గొప్ప సినిమా చేశామని చెప్పడం లేదు. చాలా కష్టపడి ఇష్టపడి పనిచేశాం. డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడుతున్నాం. వాళ్లతో మాట్లాడిన తర్వాత  రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. మార్చిలో ఖచ్చితంగా రిలీజ్ ఉంటుంది` అన్నారు.
 
అతిథి మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఇవాళ యూత్ లైఫ్ లో జరుగుతున్న కాంటెంపరరీ కాన్సెప్ట్ ఉంటుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ల ప్రతిభ చూపించారు. సంగీత దర్శకుడు మోహిత్ కు ఇండస్ట్రీలో పేరు రావాలని కోరుకుంటున్నా. ట్రైలర్ బాగుంది, సూపర్ రెస్పాన్స్ రావాలి. అలాగే సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరోలు మాధవ్ చిలుకూరి, రజత్ రాఘవ్ మాట్లాడుతూ, ట్రైలర్ చూస్తే ఎలాంటి సినిమానో మీకు కొంత అర్థమయి ఉంటుంది. మ్యాడ్ అంటే పిచ్చి అని కాదు మ్యారేజ్ అండ్ డివోర్స్ అని అర్థం. మ్యాడ్ అంటే ఏంటని పజిల్స్ పెట్టేవారు డెరెక్టర్ గారు. కానీ మ్యారేజ్ అండ్ డివోర్స్ అనే టైటిల్ కుదిరింది. టైటిల్ కు తగినట్లే కథ ఉంటుంది. ఈ కథలో విలన్లు ఎ‌వరూ ఉండరు చిన్న చిన్న గొడవల వల్ల హీరో హీరోయిన్లు విడిపోతుంటాయి. మోహిత్ రెహ్మానియా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మ్యూజిక్ ను మధుర శ్రధర్ గారు ప్రమోట్ చేసి తన ఆడియో ద్వారా ప్రచారం తీసుకొచ్చారు. అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహ్మానియా మాట్లాడుతూ....చెన్నై నుంచి వచ్చాక నా మొదటి సినిమా "మ్యాడ్". సంగీత దర్శకుడికి దర్శకుడి విజన్ ఉండాలి. లక్ష్మణ్ గారికి చాలా క్లారిటీ ఉంది. టెక్నీషియన్ కు ఏది కావాలో ఆయనకు తెలుసు. కాస్ట్ అండ్ క్రూ చాలా బాగా పనిచేశారు. అన్నారు.
 
శ్వేత వర్మ మాట్లాడుతూ, సినిమా మిమ్మల్ని మర్చిపోయేలా ఉండాలని ఓ ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ అన్నారు. ఈ సినిమా కూడా చూస్తున్నంత సేపూ మిమ్మల్ని మీరు మర్చిపోయేలా చేస్తుంది. లవ్, సినిమా, మ్యూజిక్ ఈ మూడు మాత్రమే బయట ప్రపంచం మర్చిపోయేలా లీనం చేస్తాయి. "మ్యాడ్" చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కథలో చూసుకుంటారు. మీ జీవితంలో జరిగే సంఘటనలే సినిమాలో ఉంటాయి. కరోనా తర్వాత ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజై సక్సెస్ అవుతున్నాయి. మా సినిమాకు కూడా మీ ప్రేమ కావాలి. అన్నారు. నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ, సినిమా ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంటుంది. ఇది నా మొదటి సినిమా. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. అన్నారు.