బుధవారం, 11 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జనవరి 2026 (15:37 IST)

సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'

Mana Shankara Vara Prasad Garu
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతవారం రోజుల్లో ఏకంగా రూ.292 కోట్లు కొల్లగొట్టింది. వారంలో ఆరు రోజుల కలెక్షన్లు ఒక ఎత్తు అయితే ఏడో రోజు కలెక్షన్లు మరో ఎత్తుగా నిలిచాయి. ఏడో రోజు ఒక్క రోజే ఏకంగా రూ.31 కోట్లు వసూలు చేసింది. అలాగే, ఏడు రోజుల్లో రూ.292 కోట్లు వసూలు చేసిన ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి విదేశాల్లో సైతం అద్భుతమైన ఆదరణ లభించడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. 
 
ఈ నెల 12వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఈ నెల 18వ తేదీతో వారం రోజులు పూర్తి చేసుకుంది. ఏడో రోజున ఈ చిత్రం ఏకంగా రూ.31 కోట్లు వసూలు చేసింది. ఒక తెలుగు సినిమా ఏడో రోజున ఇంతటి వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి. రెండో వారం ప్రారంభం రోజునే ఈ చిత్రం రూ.300 కోట్ల మార్కును దాటుతుందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 
విదేశాల్లో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తోంది. ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు రూ.2.96 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తద్వారా చిరంజీవి కెరీర్‌లో అక్కడ 3 మిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలి చిత్రంగా 'మన శంకరవరప్రసాద్ గారు' రికార్డు సృష్టించనుంది.