గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 జనవరి 2026 (17:54 IST)

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ఆయన మరోమారు తన స్టామినా ఏంటో ఈ చిత్రం ద్వారా నిరూపించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ మూవీగా నిలిచింది. దీంతో వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే రూ.261 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భారీ పోటీ నడుమ కూడా ఈ చిత్రం రోజురోజుకూ వసూళ్లు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సినీ ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. 
 
సాధారణంగా భారీ బడ్జెట్ చిత్రాలు లాభాల బాట పట్టడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుంది. కానీ, ఈ చిత్రం మాత్రం కేవలం ఆరు రోజుల్లోనే బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. పండగ సెలవులు పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 
 
కేవలం స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో చిరంజీవి గత రికార్డులను ఈ చిత్రం చెరిపేసి, త్వరలోనే 3 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్‌లో కూడా అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ ఇంకా జోరుగా సాగుతున్నాయి. దీంతో ఈ చిత్రం త్వరలోనే రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.