శుక్రవారం, 23 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 డిశెంబరు 2025 (19:26 IST)

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

chiranjeevi - nayanathara
మెగాస్టార్ చిరంజీవి తన కొత్త చిత్రం కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ను ప్రయత్నించేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఆ చిత్ర దర్శకుడు మాత్రం నో చెప్పారు. పైగా, తాను చెప్పిన లుక్‌లోనే కనిపించాలన్న కండిషన్ పెట్టారు. దీంతో చిరంజీవి ఆ దర్శకుడు మాటకు విలువ ఇచ్చి ఆయన చెప్పినట్టుగానే తన లుక్‌ను డిజైన్ చేసుకున్నారు. 
 
ఆ దర్శకుడు ఎవరో కాదు అనిల్ రావిపూడి. ఆయన రూపొందిస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. వచ్చే యేడాది సంక్రాంతికి వస్తున్నారు. సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి లుక్‌ గురించి మాట్లాడారు. ఈ సినిమా కోసం చిరు.. 'సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌' లుక్‌ ప్రయత్నిస్తానని అన్నారని, కానీ తానే నో చెప్పినట్లు తెలిపారు. బయట ఎలా ఉన్నారో సినిమాలోనూ అలానే చూపిస్తానని చిరుకి చెప్పినట్లు పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం చిరంజీవి ఎంత స్లిమ్‌గా, అందంగా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారని కొనియాడారు. 
 
వేరే హీరోల గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లకు గతంలో కథలు వినిపించానని, కానీ అవి వర్కౌట్‌ కాలేదన్నారు. రవితేజతో 'రాజా ది గ్రేట్‌' సీక్వెల్‌ చేయాలనుందని తెలిపారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'మన శంకర వరప్రసాద్‌ గారు'లో చిరు సరసన నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేశ్‌ అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.