సంబంధిత వార్తలు
- స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం
- పారాచూట్ అడ్వాన్స్డ్ ప్రోటీన్ షాంపూ విడుదల
- ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడిన ఎయిరిండియా బస్సు
- manchu manoj: డేవిడ్ రెడ్డి కాదు రాక్షస రెడ్డి అన్న బ్రిటీషర్స్ ఎందుకంటే...
- Manchu Manoj: వడ్డీ కాసుల వాడ గా రాబోతున్న మంచు మనోజ్
దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్
దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి. ఓ నెటిజన్ షేర్ చేసిన వీడియోకు మంచు మనోజ్ స్పందించారు. శనివారం నేరుగా ఆ సమాధి వద్దకు వెళ్లి దాన్ని శుభ్రం చేస్తానని హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం శనివారం తన టీమ్‌తో కలిసి సమాధి వద్దకు చేరుకున్న ఆయన.. ఆ ప్రాంగణంలో ఉన్న చెత్తా చెదారాన్ని స్వయంగా తొలగించారు.
'సమాధి దుస్థితి చూసి చాలా బాధేసింది. ఇక్కడకు వచ్చి మూడేళ్లవుతోంది. అప్పుడు కూడా ఇలానే ఉంటే శుభ్రం చేశాం. సోషల్ మీడియాలో వైరలైన వీడియో నాకు మా టీమ్ శుక్రవారం రాత్రి షేర్ చేసింది. ఈరోజు ఉదయాన్నే వచ్చి క్లీన్ చేసి షూటింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నా' అని మనోజ్ చెప్పారు.
శనివారం దాసరి నారాయణ రావు వర్థంతి కావడంతో విగ్రహం వద్దకు వెళ్లి దండం పెట్టుకోవాలనుకున్నానని కానీ, వీడియో చూసి సమాధి వద్దకు వచ్చినట్లు చెప్పారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి నివాళులర్పించారు.
దాసరి సమాధి దుస్థితిపై స్పందించిన మంచు మనోజ్, గీతా ఆర్ట్స్
— ???? ???????????????????????? ???? (@dmuppavarapu) May 30, 2026
దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై స్పందించిన నటుడు మంచు మనోజ్.. తన అభిమానులను అక్కడికి పంపించి శుభ్రపరిచే కార్యక్రమాలు ప్రారంభించారు. pic.twitter.com/GWBHCF1zRY
