గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 20 జనవరి 2026 (18:26 IST)

Sharva: మార్కెటింగ్ నా చేతుల్లో లేదు, ఇండియా గర్వపడే సినిమాగా బైకర్ :శర్వా

Hero Sharva
Hero Sharva
హీరో శర్వా సంక్రాంతి చిత్రం నారీ నారీ నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా శర్వా  సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
కొన్ని సినిమాలకి కథ విన్నప్పుడే తెలిసిపోతుంది కదా?
-అన్ని సినిమాలు కథ బాగుంటేనే చేస్తాం. అయితే అన్ని కుదిరినప్పుడే అది వర్క్ అవుట్ అవుతుంది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో కలిస్తే బడ్జెట్లు పెరగవు. మంచి సినిమాలు బడ్జెట్లో తీయొచ్చు. ప్రతి సినిమా బాగా తీయాలని కూర్చుంటే అన్ని సినిమాలు బాగుంటాయి.
 
నెక్స్ట్ నుంచి శర్వా సంక్రాంతి ఉంటుందా
-వుంటే బాగుంటుంది.  నెక్స్ట్ ఇయర్ వరకైతే కన్ఫర్మ్ చేశాం.
 
సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది కానీ ఇంత సంక్రాంతికి చివరిలో రావడానికి కారణం ఏంటి?
-ఆల్రెడీ నాలుగు సినిమాలు బుక్ అయ్యాయి. అయితే ఈ సంక్రాంతికి చాలా పెద్ద లాంగ్ వీకెండ్స్ కలిసి వచ్చాయి. 23 నుంచి 26 వరకు మళ్లీ  పెద్ద వీకెండ్ వుంది. మేము కంటెంట్ నీ బలంగా నమ్మాము. సంక్రాంతి సీజన్లో  ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఆ నమ్మకం మాకు నిజమైంది.
 
-ఇప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరుగుతున్నాయి. సినిమాకి చాలా మంచి లాంగ్ రన్ ఉంటుంది.
 
- ఈ సినిమా తొలి రోజు నుంచి చాలా నమ్మకం ఉంది. సినిమా ఎప్పుడు వచ్చినా సరే బ్లాక్ బస్టర్ అని మొదటి నుంచి చెప్తున్నాను.  
 
ఈ సినిమాలు మీరు చాలా యంగ్ అండ్ స్లిమ్ గా కనిపించారు.. బైకర్ కోసం చేసిన ప్రిపరేషన్ దీనికి వర్కౌట్ అయ్యిందా?
-నాకు జాను సినిమా సమయంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. నిజంగా పెద్ద యాక్సిడెంట్ అది. తర్వాత నేను బరువు పెరిగాను. శ్రీకారం, ఆడవాళ్లకు జోహార్లు సినిమాల్లో నేను కాస్త లావుగా కనిపిస్తాను, ఆ లుక్  నాకే నచ్చదు. మనకు మనం నచ్చేలా ఉండాలని సంకల్పంతో మొదట వాకింగ్ చేయడం ప్రారంభించాను. తర్వాత రన్నింగ్, ఆ తర్వాత స్త్రెంత్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేశాను. తర్వాత యోగా చేశాను. అవన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాయి.  
 
-బైకర్ లో రెండు రకాల క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో ఒకటి ఫాదర్ రోల్.  సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో సూర్య గారు ఎలా కనిపిస్తారో అలాంటి క్యారెక్టర్. దాని కోసం చాలా కష్టపడ్డాను. అవన్నీ కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి ఉపయోగపడ్డాయి.  నిజానికి బైకర్ సినిమా ముందుగా రావాలి. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది రాలేదు.
 
బాలకృష్ణ గారి టైటిల్ తీసుకున్నారు ఆయనతోనే లాంచ్ చేయించారు.. ఆ ఒత్తిడి ఏమైనా ఉందా
-అంత గొప్ప సినిమా పేరు పెట్టుకున్నప్పుడు ఆ పేరు నిలబెట్టకపోతే బాగుండదు. నిన్న ఆయనతో మాట్లాడాను. ఎంతో అభినందించారు.  నా పరువు నిలబెట్టావ్ శర్వా అన్నారు.
 
మీరు కూడా కామెడీ సినిమా చేసి చాలా రోజులైంది కదా?
-నేను ఒక జానర్ కి పరిమితం అవ్వాలని అనుకోలేదు. ప్రతి సినిమా కొత్తగా చేయాలి కొత్త కథలు చేయాలని తపన ఉంటుంది. అమ్మ చెప్పింది, అందరి బంధువయా, శతమానం భవతి.. ఇలాంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి దగ్గర కావడం బ్లెస్సింగ్ గా భావిస్తున్నాను.
 
శ్రీనువైట్ల గారితో చేసే సినిమా ఎలా ఉండబోతుంది?
-అది అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఆయనతో చేస్తే కామెడీ సినిమా చేయాలని అనుకున్నాను. చాలా అద్భుతమైన కథ కుదిరింది.
 
శ్రీ విష్ణు క్యామియో ఐడియా ఎవరిది?
-అది డైరెక్టర్ రామ్ దే. వాళ్ళిద్దరూ కలిసి సామజవరగమన చేశారు. మరో సినిమా కూడా చేయబోతున్నారు. నిజానికి చాలా చిన్న క్యారెక్టర్. చాలా పెద్ద మనసు చేసుకొని ఆ క్యారెక్టర్ చేశారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు కి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నాను. ఇదంతా శ్రీ విష్ణు గొప్పతనం.
 
మ్యూజిక్ గురించి?
-విశాల్ తో పడి పడి లేచే మనసు సినిమా చేశాను. దానికి అది అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు.  మళ్లీ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ కుదిరింది. శ్రీకారం శతమానం భవతి సినిమాల్లో పండగ పాటలు ఉంటాయి. ఈ సినిమాలో కూడా పాటలు పండగ సమయంలో అందరూ చాలా ఆహ్లాదంగా  వింటున్నారు.
 
బైకర్ ఎలా ఉండబోతుంది
-అది ఇండియా మొత్తం ఇండియా గర్వపడే సినిమా అవుతుంది. తెలుగు సినిమా అని కాలర్ ఎగరేసుకొని చెప్పే సినిమా అవుతుంది.  
 
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు గురించి?  
బైకర్ షూటింగ్ అయిపోయింది. సంపత్ నంది గారితో భోగి సినిమా షూటింగ్ జరుగుతోంది. భోగి కూడా చాలా మంచి కథ.
 
సక్సెస్ లు వస్తున్నా మీ రేంజ్ మారకపోవడానికి కారణం?
సినిమా సక్సెస్ అనేది మనచేతుల్లో లేనట్లే మార్కెటింగ్ కూడా అంతే. దానిపై నాకూ పెద్దగా అవగాహన లేదు. వచ్చిన అవకాశాన్ని తీసుకుని నిర్మాతల హీరోగా వుండాలనేది నా మతం.