1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Massive action schedule for Megastar Chiranjeevi's 158th film in Hyderabad.

Chiru158: హైదరాబాద్‌లో శమెగాస్టార్ చిరంజీవి 158 చిత్రం భారీ యాక్షన్ షెడ్యూల్

Bobby Welcomes Chiranjjeevi
Bobby Welcomes Chiranjjeevi
'వాల్తేరు వీరయ్య' భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం #ChiruBobby2 / #Chiru158. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో విస్తృతంగా జరుగుతోంది.
 
 ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్న భారీ యాక్షన్ సన్నివేశం ఈ చిత్రంలో మేజర్ హైలెట్స్ లో ఒకటి. భారీ సంఖ్యలో ఫైటర్లతో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సన్నివేశం, మెగాస్టార్ చిరంజీవిని పవర్ ఫుల్ , డైనమిక్ అవతార్‌లో ప్రజెంట్ చేయనుంది. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేలా రూపొందుతున్న ఈ యాక్షన్ ఘట్టంలో, మెగాస్టార్ స్వయంగా పాల్గొంటూ చాలా సాహసోపేతమైన స్టంట్స్ చేస్తున్నారు.
 
అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన 'టైటిల్ టీజర్'ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నద్ధమవుతోంది.
 
ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. థమన్ ఎస్ సంగీతం సమకూరుస్తుండగా, ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్‌ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను అవినాష్ కొల్లా నిర్వహిస్తుండగా, ఎడిటింగ్ ఆంటోనీ రూబెన్. 
 
కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పోట్లూరి అడిషినల్ స్క్రీన్‌ప్లేను సమకూర్చారు. స్టార్ రచయితల ద్వయం భాను-నందు సంభాషణలు రాస్తున్నారు. 
 
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాలలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 
 
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్
About Writer
దేవీ
తర్వాతి కథనం
Victory Venkatesh :అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్