1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Megastar Chiranjeevi and Director Bobby kick off a key schedule for Chiru158 in Pollachi

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా తమిళనాడులోని పొల్లాచ్చిలో కీలక షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటూ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా, రామ్ చరణ్ నటించిన 'పెద్ది' చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ #ChiruBobby2 యూనిట్ విడుదల చేసిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
 
దర్శకుడు బాబీ కొల్లి మరింత భారీ స్థాయిలో కథను సిద్ధం చేశారు. దశాబ్దాలుగా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి ఈ చిత్రంలో తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన మరోసారి అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ అందించనున్నారు. ప్రొడక్షన్ డిజైన్ అవినాశ్ కొల్లా నిర్వహిస్తుండగా, ఎడిటింగ్‌ను ఆంటోని ఎల్. రూబెన్ చేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ఆడిషినల్ స్క్రీన్‌ప్లే రచయితలుగా పనిచేస్తున్నారు. భాను–నందు ద్వయం సంభాషణలను అందిస్తున్నారు.
 
ఈ చిత్రంలో కథానాయికతో పాటు ఇతర ప్రధాన తారాగణానికి సంబంధించిన వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్.
 
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బాబీ కొల్లి.
నిర్మాత: వెంకట్ కె నారాయణ.
బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్.
సంగీతం: థమన్ ఎస్.
స్క్రీన్ ప్లే రైటర్స్: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి.
ఆడిషినల్ స్క్రీన్ ప్లే రైటర్స్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి.
DOP: విజయ్ కార్తీక్ కన్నన్.
ఎడిటర్: ఆంటోనీ రూబెన్.
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.
VFX సూపర్‌వైజర్: యుగంధర్ టి.
డైలాగ్స్: భాను-నందు.
ఛీప్ కో-డైరెక్టర్లు: బెల్లంకొండ సత్యం, పూసల రాధాకృష్ణ.
కో-డైరెక్టర్: వి క్రాంతి చక్రవర్తి.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య పోట్ల.
PRO: వంశీ-శేఖర్.
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా.
About Writer
దేవీ
తర్వాతి కథనం
రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి నుంచి ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్‌ రిలీజ్