సంబంధిత వార్తలు
- Gold price today: సరికొత్త ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసిన పసిడి ధరలు
- సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌కు భయపడి క్షమాపణ చెప్పి ఉండాల్సిందికాదు : అనంత్ శ్రీరామ్
- 15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....
- ఐసీసీ టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్
- 14-06-2026 నుంచి 20-06-2026 వరకు వార ఫలితాలు
Chiranjeevi and Ram Charan : 2026 లో మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ సరికొత్త చరిత్ర
Megastar Chiranjeevi and Ram Charan
భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో లెజెండరీ ఫ్యామిలీస్, సక్సెస్ ఫుల్ జనరేషన్స్, ఒకే ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలు వచ్చారు. అయితే 2026లో మాత్రం భారతీయ సినిమా చరిత్రలోనే అరుదైన ఘట్టం నమోదైంది. తండ్రి, కుమారుడు కలిసి ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ వార్త రూపంలో తెలియజేసింది.
మొదట మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సౌత్ ఇండియన్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ పెద్దితో ఆ రికార్డును అధిగమించారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది, ప్రపంచవ్యాప్తంగా మన శంకర వర ప్రసాద్ గారు చిత్ర ఫైనల్ కలెక్షన్లను దాటి, 2026లో సౌత్ ఇండియా బాక్సాఫీస్ చాంపియన్‌గా అవతరించింది. ప్రస్తుతం ఈ చిత్రం 400 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతోంది.
ఈ ఘనత కేవలం కలెక్షన్ల పరంగా మాత్రమే కాదు, భారతీయ సినిమా చరిత్రలో ఒకే ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-2 చిత్రాల స్థానాలను తండ్రి, కుమారుడు నమోదు చేయడం ఇదే తొలిసారి. ఒకే కుటుంబానికి చెందిన రెండు జనరేషన్స్ ఒకేసారి బాక్సాఫీస్‌ను ఏలడం అరుదైన రికార్డు.
ఇంకా ప్రత్యేకత ఏమిటంటే, ఈ రెండు చిత్రాలు కూడా థియేట్రికల్ బిజినెస్ కి అత్యవసరమైన సమయంలో వచ్చాయి. ముఖ్యంగా పెద్ది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ ఊరటను ఇచ్చింది.
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి 2026ను మెగా కుటుంబానికి చారిత్రాత్మక సంవత్సరంగా మార్చారు. బాక్సాఫీస్ చరిత్రలో ఎన్నో సంవత్సరాలు గుర్తుండిపోయే అరుదైన అధ్యాయాన్ని సృష్టించారు.
