విశ్రాంతి లేకుండానే తదుపరి చిత్రం కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్
సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం రూ.350 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే బాబీ కొల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు.
ఇప్పటికే పూర్వ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసిన బాబీ వెంటనే సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. తండ్రి, కూతురు కథతో ఆ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం. కూతురు పాత్ర కోసం కృతిశెట్టి పేరు ప్రచారంలోకి వచ్చినా, తాజాగా సారా అర్జున్‌ని ఎంపిక చేశారని సమాచారం.
ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుందని తెలిసింది. ఇప్పటికే ఓ సీనియర్ హీరోయిన్ పాత్ర పేరు ప్రచారంలోకి వచ్చింది. మరొక హీరోయిన్ ఎంపికపై చిత్ర బృందం కసరత్తులు చేస్తోంది. 'వార్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి - బాబీ కలయికతో రూపొందుతున్న చిత్రమిది.