మంగళవారం, 2 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2025 (13:42 IST)

హరికథ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసిన మంత్రి వాకిటి శ్రీహరి

Harikatha release date, Minister Vakiti Srihari
Harikatha release date, Minister Vakiti Srihari
కిరణ్, రంజిత్, సజ్జన్ , అఖిల్ రామ్, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం హరికథ. ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు , కవిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా అశోక్ కడ్లూరి, రాంపురం వెంకటేశ్వర్ రెడ్డి సమర్పణలో అనుదీప్ రెడ్డి దర్శకత్వం వహించారు. లవ్ & ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ పోస్టర్ ను పశుసంవర్థక, క్రీడలు & యువజన సర్వీసుల శాఖల మంత్రి వాకిటి శ్రీహరి విడుదల చేస్తూ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. 
 
ఈ చిత్రానికి కెమెరామెన్ గా మస్తాన్ షరీఫ్ వ్యవహరించగా బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మహావీర్ సంగీతం సమకూర్చారు.  నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకొని విడుదల సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని నవంబర్ 7వ తేదీన విడుదల చేయబోతున్నారు అని మంత్రి వాకిటి శ్రీహరి, ఇంకా  చిత్ర బృందం తెలియచేయడం జరిగింది. 
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనుదీప్ రెడ్డి మాట్లాడుతూ .. హరికథ సినిమా వినూత్నమైన సినిమా. అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ, ప్రేమ కథా చిత్రం. ఎక్కడా రాజీ పడకుండా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దిన సినిమా ఇది అని చెప్పడం జరిగింది.
 
 చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది,సినిమా కూడా బాగా వచ్చింది.నవంబర్ 7 న విడుదల అవ్వబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా చూడాలని కోరుతూ మా సినిమా థియేట్రికల్ రిలీజ్ పోస్టర్ ని విడుదల చేసిన  పశుసంవర్థక, క్రీడలు  మరియు యువజన సర్వీసుల శాఖల మినిస్టర్ వాకిటి శ్రీహరి గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
 
నటీనటులు : కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల్ రామ్, లావణ్య రెడ్డి, కీర్తి, మాన్యం భాస్కర్, పద్మ నిమ్మగోటి, కృష్ణ పెనుమర్తి.