కన్నె పిట్టారో.. పాట పాడుతూ డెకాయిట్ పూర్తిచేశానన్న మృణాల్ ఠాకూర్
Mrunal Thakur, advi sesh and team
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ, గ్రిప్పింగ్ కథనంతో ఆకట్టుకున్నారు. నేడు ఈ సినిమా షూటింగ్ లో ముగింపు రోజు అంటూ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో తన సహచర టీమ్ తో ఫొటోను షేర్ చేసుకుంది. ముఖ్యంగా టీజర్ విడుదలైన తర్వాత ఈ జంట కెమిస్ట్రీ పై కామెంట్లు వచ్చాయి.. కన్నె పిట్టారో రీమిక్స్ పాట, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలతో పాటు సినిమాకు మరింత ప్రచారం కల్పించింది.
మృణాల్ ఠాకూర్ తన చిత్ర బృందంతో కలిసి షూటింగ్ ముగింపును జరుపుకుని ఒక సంతోషకరమైన రీల్‌ను పంచుకుంది. ఈ వీడియోలో, మృణాల్ చిత్ర బృందంతో కలిసి చాలా సంతోషంగా కనిపించింది. 'కన్నె పిట్టారో' రీమిక్స్ పాటలోని పంక్తులను పాడుతూ, తన ఉత్సాహాన్ని ప్రదర్శించింది.
ఈ చిత్రం కోసం అడివి శేష్ తెలుగులోని ఓ మాండలిక తరగతులు తీసుకుని నటించడంలో చూపిన చిత్తశుద్ధి అందరినీ ఆకట్టుకుంది, ఇది సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. షానీల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది సెలవుల వారాంతంలో మార్చి 19న విడుదల చేయనున్నారు.