1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Naga Babu and Varun Tej are gearing up to act together.

నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి నటించడానికి బరి లోకి దిగబోతున్నారు

Nagabbu, Varun tej
Nagabbu, Varun tej
NRI అభిమానులతో ఈరోజు జరిగిన జూమ్ సమావేశంలో వరుణ్ తేజ్ కొణిదెల ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు; తండ్రీకొ డుకులు ఇద్దరూ కలిసి తెరపై కనిపించబోతున్నారని దీని ద్వారా ధృవీకరించారు. కమిటీ కుర్రోళ్లు' (Committee Kurrollu) చిత్రంతో గుర్తింపు పొందిన యదు వంశీ దర్శకత్వంలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
 
 
రియల్ లైఫ్ తండ్రీకొడుకులు తొలిసారి వెండితెరను పంచుకోబోతుండటం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. అలాగే, సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ విషయం బిగ్గెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే, విదేశాల్లో ఉన్న అభిమానులతో వరుణ్ తేజ్ ఇటీవల నిర్వహించిన ప్రత్యేక జూమ్ (Zoom) ఇంటరాక్షన్‌లో ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
 
"మా నాన్న నాగబాబు గారు కూడా 'బరి' సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు" అని వరుణ్ తేజ్ అభిమానులతో పంచుకున్నారు. వరుణ్ నోటి నుంచి ఈ మాట రాగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
 
నిహారిక కొణిదెల నిర్మాతగా భారీ సినిమా 'పింక్ ఎలిఫెంట్ క్రియేషన్స్' బ్యానర్‌పై చిన్న సినిమాల నుంచి ఓటీటీ కంటెంట్ వరకు నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తన సోదరుడు వరుణ్ తేజ్ హీరోగా, తండ్రి నాగబాబు ప్రధాన పాత్రలో 'బరి' అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ బరి సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.
About Writer
దేవీ
తర్వాతి కథనం
ఆర్‌. మాధవన్‌ నటించిన జి.డి.నాయుడు విడుదలకు సిద్ధం