1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Naga Chaitanya approaches Delhi HC over personality rights, AI content suggesting he cheated on Samantha Ruth Prabhu

సమంతను హీరో నాగ చైతన్య మోసం చేశారా?

Samantha Ruth Prabhu
తన మాజీ భార్య, సినీ హీరోయిన్ సమంతను ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య మోసం చేసినట్టు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇవి రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో నాగచైతన్య కోర్టుకెక్కారు. తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నటి సమంత రుత్ ప్రభుతో తన గత బంధాన్ని ఉద్దేశించి కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు చేస్తున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం నాగచైతన్య ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన పేరు, ఫోటోలు, వీడియోలను వినియోగించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ పలు వెబ్‌సైట్లకు నోటీసులు జారీచేసింది. 
 
ఈ కేసులో నాగచైతన్య తరపు న్యాయవాది వైభవ్ గగ్గర్ వాదనలు వినిపిస్తూ, కొన్ని ఆన్‌లైన్ మధ్యమాలు సమంతను చైతన్య మోసం చేశారని, ఆమె కెరీర్‌ను నాశనం చేశారని, నిరాధారమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇది కేవలం విమర్శకాదు. ఖచ్చితంగా వ్యక్తిగత వేధింపులు, ట్రోలింగ్ కిందికే వస్తుంది అని కోర్సు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నటుడి ప్రతిష్టను కించపరిచేలా ఉన్న కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 
 
గత 2009లో వచ్చిన 'ఏ మాయ చేశావే' సినిమా సమయంలో పరిచయమైన నాగ చైతన్య, సమంతలు కొన్నేళ్లపాటు ప్రేమించుకుని 2017లో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే, నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2021 అక్టోబరు నెలలో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత వారిద్దరూ తమతమ జీవితాల్లో ముందుకుసాగుతున్నారు. నాగచైతన్య 2024 డిసెంబరులో నటి శోభితా ధూళిపాళ్లను, సమంత 2025 డిసెంబరు నెలలో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుని స్థిరపడ్డారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
దాసరి ఇండస్ట్రీలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారు : మంచు మనోజ్