Naga Chaitanya: వృషకర్మ స్టన్స్ కోసం నాగ చైతన్య కొత్త BTS స్టిల్స్ రిలీజ్
Naga Chaitanya BTS Stills
ఇటీవల విడుదలైన 'వృషకర్మ' గ్లింప్స్ అన్ని ప్లాట్‌ఫామ్‌లు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. వెంటనే వైరల్ అయ్యి భారీ సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇంటెన్స్ విజువల్స్, పవర్ ఫుల్ వరల్డ్ బిల్డింగ్ అందరినీ ఆశ్చర్యపరిచాయి, సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
మేకర్స్ ఈరోజు యువ సామ్రాట్ నాగ చైతన్యను ఫియర్సెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ లో ప్రజెంట్ చేసే సరికొత్త BTS స్టిల్స్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫోటోలు పాత్ర కోసం ఆయన చేసిన కఠినమైన ట్రాన్స్‌ఫర్మేషన్, అలాగే అర్జున్ పాత్రను సహజంగా తెరపై చూపించేందుకు పెట్టిన అంకితభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఒక BTS స్టిల్‌లో చైతన్య ఇంటెన్స్ గా వర్కౌట్ చేస్తూ కనిపిస్తున్నారు. ఆ ఫోటోలో ఆయన ప్రత్యేకంగా ఈ పాత్ర కోసం తీర్చిదిద్దుకున్న లీన్, చిసెల్డ్ ఫిజిక్ స్పష్టంగా కనిపిస్తోంది. వృషకర్మ ప్రపంచంలో పావర్ ఫుల్ అర్జున్ పాత్రను పోషించేందుకు ఆయన చూపిన క్రమశిక్షణ, అంకితభావం ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా వెల్లడవుతోంది.
మరో స్టిల్‌లో చైతన్య గాయాలతో, యుద్ధానికి సిద్ధమైన యోధుడిలా కనిపిస్తున్నారు. ఈ రఫ్ అండ్ రగ్డ్ లుక్ సినిమాలో ఉండబోయే హై-ఆక్టేన్ యాక్షన్‌తో పాటు ఎమోషన ని సూచిస్తోంది. ఇది చైతన్య కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నడూ కనిపించని ఇంటెన్స్ ఆన్‌స్క్రీన్ అవతార్‌లలో ఒకటిగా నిలవనుంది.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా మిస్టరీ, మైథాలజీ, యాక్షన్ అంశాలను కలిపి ఒక గొప్ప సినీమాటిక్ అనుభూతిని అందించబోతుంది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో వృషకర్మపై ఆసక్తి మరింత పెరిగింది. బిగ్ స్క్రీన్ పై నాగ చైతన్య పవర్ ఫుల్, విభిన్నమైన నటనను చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల థియేట్రికల్ హక్కులు సుమారు ₹45 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
తారాగణం: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ, జయరామ్