1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nagarjuna, Mani Ratnam... 'Geethanjali' set for a grand re-release in 4K.

Nagarjuna: నాగార్జున, మణిరత్నం... గీతాంజలి 4Kలో గ్రాండ్ రీ-రిలీజ్‌ కు సిద్ధం

Nagarjuna - Gitanjali 4K
Nagarjuna - Gitanjali 4K
కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలై ఎన్నేళ్లు గడిచినా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంటాయి. అలాంటి ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో కింగ్ నాగార్జున ‘గీతాంజలి’ ఒకటి. ఇప్పుడు ఈ లవ్‌ఫుల్ క్లాసిక్ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 13న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 4K వెర్షన్‌లో ‘గీతాంజలి’ గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది.
 
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం అద్భుతమైన కథనం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, గొప్ప సంగీతంతో ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేసింది. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా ప్రేమ, భావోద్వేగాలు, అందమైన అనుభూతులను ప్రత్యేకమైన శైలిలో ఆవిష్కరించింది.
 
ఇప్పటివరకు ‘గీతాంజలి’ని ప్రేమించిన ప్రేక్షకులకు ఈ 4K రీ-రిలీజ్ మరోసారి ఆ మధురానుభూతిని థియేటర్‌లో అందించనుంది.  పిక్చర్ క్వాలిటీ, విజువల్ డీటెయిలింగ్‌తో సినిమా మరింత గ్రాండ్‌గా కనిపించనుంది. అదే సమయంలో ఒరిజినల్ సినిమా అందించిన ఎమోషన్, చార్మ్‌ను ఎలాంటి మార్పు లేకుండా ప్రేక్షకులకు అందించనున్నారు.
 
మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం ‘గీతాంజలి’కి ఇప్పటికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన స్వరపరిచిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎవర్ గ్రీన్.
 
బూర్లె శివ ప్రసాద్ నేతృత్వంలోని శ్రీ పద్మిని సినిమాస్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను మరోసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను ప్రేమించిన అభిమానులతో పాటు, కొత్త తరం ప్రేక్షకులకు కూడా ‘గీతాంజలి’ని బిగ్ స్క్రీన్‌పై ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం లభించనుంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
అనిల్ రావిపూడి ఆవిష్కరించిన కుకూన్స్ సినిమా పోస్టర్