సోమవారం, 16 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2025 (10:13 IST)

Laya: రెండు దశాబ్దాల తర్వాత శ్రీకాంత్, లయ తో నాగేశ్వరరెడ్డి చిత్రం

Srikanth, Laya
Srikanth, Laya
శ్రీకాంత్, లయ కాంబినేషన్ లో ఓ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ శివార్లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాకు జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. గతంలోో 6టీన్స్ నుంచి పలు సినిమాలు చేశారు. అయితే మంచు విష్ణు తో చేసిన సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దానితో కొంత గేప్ తీసుకుకన్నారు. కాగా, లయ కాంబినేషన్ లో శివాజీతో సినిమా చేయాల్సి వుంది.
 
కానీ కొన్ని కారణాలవల్ల అది కొనసాగలేదు. షడెన్ గా శ్రీకాంత్ కాంబినేషన్ లోసినిమా సెట్ అయింది. దర్శకుడు కుటుంబకథా చిత్రంగా మలుస్తున్నారు. అది కూడా నాగేశ్వరరెడ్డి మార్క్ తో కూడిన ఎంటర్ టైన్ మెంట్ వుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు అరుణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
లోగడ వీరి కాంబినేషన్ లో నేను పెళ్లికి రెడీ, స్వరాభిషేకం వంటి సినిమాలు వచ్చాయి. దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్లో సినిమా రావడం విశేషం.