మంగళవారం, 9 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : మంగళవారం, 9 డిశెంబరు 2025 (18:59 IST)

ఆస‌క్తి హ‌ద్దులు దాటితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే నయనం ట్రైలర్

Varun Sandesh, Priyanka Jain and team
Varun Sandesh, Priyanka Jain and team
తెలుగు ఒరిజిన‌ల్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అల‌రించ‌నుంది ‘న‌య‌నం’. ఈ ఒరిజిన‌ల్ జీ5లో డిసెంబ‌ర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్ల‌ర్‌ను స్వాతి ప్ర‌కాశ్ డైరెక్ట్ చేశారు. మ‌నుషుల్లోని నిజ స్వ‌భావానికి, ఏదో కావాల‌ని త‌పించే తత్వానికి మ‌ధ్య ఉండే సున్నిత‌మైన అంశాల‌ను ఇందులో చూపించారు. మంగ‌ళ‌వారం ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే..
 
‘క‌న్ను ట్రాన్స్‌మీట‌ర్‌.. నాలుగు నిమిషాలు వాళ్ల జీవితంలో ఏం జ‌రుగుతుందో నేను చూడ‌గ‌ల‌ను.. వండర్ఫుల్ కదా’ అనే డైలాగ్‌తో ‘న‌య‌నం’ ట్రైలర్ ప్రారంభ‌మైంది.
త‌ర్వాత వ‌రుణ్ సందేశ్ పాత్ర‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తారు. త‌ను కంటికి సంబంధించిన ప్ర‌యోగాలేవో చేస్తుంటాడు. అనుకోకుండా అత‌నిపై ఎవ‌రో దాడి చేస్తారు.
 
ఇత‌రుల జీవితాల్లో ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి హ‌ద్దులు దాటితే ఏమ‌వుతుంద‌నే ఓ లైన్‌ను మ‌న‌కు చూపిస్తారు. మ‌రొక‌రి జీవితాల్లోకి ర‌హ‌స్యంగా తొంగి చూస్తే అది నీ జీవితానికి ప్ర‌మాదంగా మారుతుంది. అనే లైన్‌తో హీరో ఇత‌రుల జీవితాల్లోకి చూసే స్వ‌భావాన్ని క‌లిగి ఉంటాడ‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఆ త‌ర్వాత హీరోయిన్ ప్రియాంక జైన్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తారు. ఆమె చీర‌క‌ట్టులో సంప్ర‌దాయబ‌ద్దంగా అందంగా ఉంది.
 
కానీ ట్విస్ట్ మాత్రం జ‌ల్దొస్త‌ది అంటూ మ‌రో పాత్ర ప‌రిచ‌యం అవుతుంది. ఆయ‌న మా ఆయ‌నండి.. ఓ లేడీ వాయిస్ వినిపిస్తుంది. వ‌రుణ్ సందేశ్ పాత్ర దేనికో టెన్ష‌న ప‌డుతుంటుంది. .. ఆ వెంట‌నే ఇంకొక మ‌ర్డ‌ర్‌కి ప్లాన్ చేసుకున్నారా? అనే ప్ర‌శ్న విన‌గానే వ‌రుణ్ సందేశ్ షాక‌వుతాడు.
 
మా అబ్బాయి క‌న‌ప‌డ‌టం లేదు  స‌ర్‌.. అనే ముదుస‌లి వ్య‌క్తి చెప్ప‌గానే పోలీసులు దేని కోస‌మే అన్వేషించే స‌న్నివేశాల‌ను చూపిస్తారు. అదే స‌మ‌యంలో పోలీస్ ఆఫీస‌ర్ అలీ రెజా పాత్ర‌ను మ‌న‌కు ప‌రిచ‌యం చేస్తారు. త‌నొక మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు.
 
క‌ళ్ల డాక్ట‌ర్ ద‌గ్గ‌ర క‌ళ్ల‌కు క‌నిపించ‌ని సీక్రెట్స్ చాలా ఉన్నాయ‌ని అలీ రెజా చెప్పే డైలాగ్ మ‌రింత ఆస‌క్తిని పెంచుతుంది. ఇంత‌కీ ఏంటా సీక్రెట్స్ అనేది తెలుసుకోవాలంటే డిసెంబ‌ర్ 19న జీ5లో స్ట్రీమింగ్ కానున్న న‌య‌నం సిరీస్ చూడాల్సిందే.
 
డా.న‌య‌న్ అనే కంటి వైద్యుడి పాత్ర‌లో వ‌రుణ్ సందేశ్ క‌నిపించ‌బోతున్ఆన‌రు. అయితే త‌న వృత్తిలో చ‌ట్టం అనుమ‌తి లేకుండా కొన్ని ప్ర‌యోగాల‌ను చేయ‌టం వ‌ల్ల ఇత‌రుల జీవితాల్లోకి తొంగి చూసే సామ‌ర్థ్యం అత‌నికి క‌లుగుతుంది. శాస్త్రీయ ఆసక్తిగా మొద‌లైన త‌న ప్ర‌యాణం ప్ర‌మాదంలోకి నెడుతుంది. అది హ‌త్య‌, మోసం చేయ‌టం, నిజాల‌ను దాచి పెట్టటం వంటి చీక‌టి వైపు అడుగులేయాల్సి వ‌స్తుంది. న‌య‌నం కేవలం థ్రిల్ల‌ర్ ఒరిజిన‌ల్ మాత్ర‌మే కాదు.. మ‌నిషి ప్ర‌వ‌ర్త‌న గురించి లోతుగా అధ్య‌యనం చేసేలా క‌నిపిస్తుంది. ఓ నిజం మిమ్మ‌ల్ని నాశ‌నం చేయ‌గ‌ల‌ద‌ని తెలిసిన‌ప్ప‌టికీ, దాన్ని తెలుసుకోవ‌టానికి ఎంత దూరం వెళ్లారనే భ‌యానక ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తుతుంది..